For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi : సినిమా మతమైతే పీఠాధిపతి రాజమౌళి.. అవమానంగా ఫీలయ్యానంటూనే అసలు విషయం చెప్పిన చిరు

  |

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి సహా కొరటాల శివ, రామ్ చరణ్ తేజ్, చిరంజీవి వంటి వారు మాట్లాడారు.. చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

   టీ తాగుతున్న సమయంలో

  టీ తాగుతున్న సమయంలో


  మెగాస్టార్ చిరంజీవి వేదిక మీద ఉన్న ఆహ్వానితులకు ఈ వేడుకకు హాజరైన అభిమానులకు ముఖ్య అతిథులకు సినిమా కోసం పనిచేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రుద్రవీణ సినిమాకి నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చిందని, నర్గీస్ దత్ అవార్డు రావడంతో ఆ అవార్డు తీసుకోవడం కోసం ఢిల్లీ వెళ్లాలని, ఢిల్లీలో సాయంత్రం అవార్డ్స్ ఇస్తారు దానికి ముందు, తేనేటి విందు ఉంటుందని చెప్పుకొచ్చారు. దానికి వెళ్లి టీ తాగుతున్న సమయంలో అక్కడి గోడలకు ఇండియన్ సినిమా వైభవం అంటూ కొన్ని చిత్రపటాలు ఉన్నాయని, అందులో నార్త్ నుంచి దాదాపు ప్రతి ఒక్కరి ఫోటో, వారి గురించి వివరాలు ఉన్నాయని సౌత్ ఇండస్ట్రీ గురించి కూడా అలాగే ఉంటుందని భావించి ముందుకు వెళితే కేవలం ఎంజీఆర్, జయలలిత కలిసి ఒక డాన్స్ వేస్తున్న భంగిమ మాత్రమే అక్కడ ఉందని చెప్పుకొచ్చారు..

   ఒక స్థాయిలో

  ఒక స్థాయిలో


  కన్నడ పరిశ్రమ నుంచి కానీ తెలుగు పరిశ్రమ గురించి గానీ మలయాళ సినీ పరిశ్రమ గురించి గానీ తమిళ సినీ పరిశ్రమ గురించి గానీ అక్కడ ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. తెలుగులో నందమూరి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గార్లను మనం దైవాంశ సంభూతులుగా భావిస్తాము కానీ వారి గురించి ఒక్క ఫోటో కూడా లేదని అది చూసి తనకు చాలా బాధ అనిపించింది అని, అవమానంగా భావించానని చెప్పుకొచ్చారు. ఇండియన్ సినీ పరిశ్రమ అంటే కేవలం హిందీ పరిశ్రమ అన్నట్లుగానే అక్కడ ఫోటోలు పెట్టారని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని తాను మద్రాసు వచ్చిన తర్వాత మీడియా ముందు వెల్లడిస్తే అప్పట్లో హిందూ పత్రిక వాళ్ళు బాగా ప్రెజెంట్ చేశారు కానీ దానికి సమాధానం ఇప్పటివరకు దొరకలేదని అన్నారు.. అప్పటి నుంచి ఎలా అయిన తెలుగు సినీ పరిశ్రమను ఒక స్థాయిలో నిలబెట్టాలి అనే ఆలోచన చేస్తూ ఉండేవాడిని అయితే బాహుబలి, బాహుబలి 2 ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో రాజమౌళి ఆ ఘనత సాధించాలని అన్నారు..

  కారణం రాజమౌళే

  కారణం రాజమౌళే


  తెలుగు సినీ పరిశ్రమ అంటే కేవలం ఒక భాషకు చెందిన పరిశ్రమ కాదని భారతదేశం మొత్తం చాటి చెప్పిన ఆయనకు తెలుగు సినీ పరిశ్రమ రుణపడి ఉంటుందని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ భారతీయ సినిమా పరిశ్రమ అనేది ఒక మతం అయితే కనుక ఆ మతానికి చెందిన పీఠాధిపతి రాజమౌళి అని చెప్పుకొచ్చారు. ఆయనను మనం అందరం చూసి గర్వపడాలి అని చెప్పుకొచ్చిన ఆయన అలాంటి రాజమౌళిని ఇలాంటి వేదిక మీద గౌరవించుకోవడం మన అదృష్టం అని చెబుతూ రాజమౌళికి సన్మానం చేశారు. ఆ తర్వాత తాను ఈ సినిమాలో భాగం అవ్వడానికి కారణం రాజమౌళి అనే విషయాన్ని చిరంజీవి బయటపెట్టారు. బహుశా ఈ విషయం ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు అని చెబుతూ నిజానికి రామ్ చరణ్ రాజమౌళి గారితో సినిమా చేస్తాను అని ఒప్పుకున్న తర్వాత కొరటాల శివ కూడా చరణ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని ఈ విషయం తెలిసి ఆయనను ఎలా ఒప్పించాలని ఆలోచిస్తున్న సమయంలో ఒకసారి కొరటాల శివను ఇంటికి పిలిపించుకున్నామని అన్నారు.

   సినిమా పూర్తి చేశామని

  సినిమా పూర్తి చేశామని


  అలా పిలిపించుకున్న సమయంలో రామ్ చరణ్ బదులు తను సినిమా చేస్తానని చెప్పడంతో కొరటాల శివ ఎగ్జయిట్ అయ్యి తన కోసం మరో కథ సిద్ధం చేస్తానని అన్నారు అని అలా నేను ఈ ప్రాజెక్టు లోకి వస్తే రామ్ చరణ్ రాజమౌళి గారు ప్రాజెక్టు లోకి వెళ్లాడని అన్నారు. ఆ తర్వాత ప్రాజెక్టు మొదలైన తర్వాత మళ్ళీ రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక పాత్ర చేయాల్సి వచ్చిందని మళ్లీ సమస్య మొదటికి రావడంతో రాజమౌళి గారితో మదర్ సెంటిమెంట్ కారణంగా ఒప్పించానని చెప్పుకొచ్చారు. ఇలా నేను చరణ్ కలిసి సినిమా చేయడం అనేది చరణ్ తల్లి సురేఖ కోరిక అని చెప్పడంతో రాజమౌళి ఎట్టకేలకు తన విధానాన్ని సైతం పక్కనపెట్టి ఒప్పుకున్నారని చిరంజీవి అన్నారు. అలా కొన్ని రోజులు రాజమౌళి గారి సినిమా కొన్ని రోజులు ఆచార్య చేస్తూ ఎట్టకేలకు సినిమా పూర్తి చేశామని చిరంజీవి వెల్లడించారు.

  చరణ్ నిరూపిస్తాడు

  చరణ్ నిరూపిస్తాడు


  ఈ సినిమాకు అన్ని విధాలుగా సహకరించిన రాజమౌళి అయితేనే ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా వుంటుందని భావించి ఆయనను పిలిచాము అని అన్నారు. ఇక ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ అందరినీ అలాగే కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి గురించి మాట్లాడారు. ఇక మీదట తెలుగు సినిమా అనేది లేదని దాదాపుగా తెలుగు సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలుగానే తెరకెక్కుతున్నాయి అని అన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, యష్ గురించి ప్రస్తావిస్తూ పుష్ప, కేజీఎఫ్ సినిమాల గురించి కూడా ఆయన మాట్లాడారు.. అలాగే పూజా హెగ్డే, రామ్ చరణ్ గురించి కూడా ఆయన పేరుపేరునా ప్రస్తావించి చివరిలో రాజమౌళి సినిమా చేసిన తర్వాత హీరోలకు సినిమా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకుంటారని ఈ సినిమా ద్వారా అది నిజం కాదని చరణ్ నిరూపిస్తాడు అని చెప్పుకొచ్చారు.

  English summary
  here is the anchor suma question and answer session in acharya pre release even
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X