"నేను నటనలో కన్నా ముందుగా డ్యాన్స్ లో ఓనమాలు దిద్ధాను." : చిరంజీవి
Mega Star Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన నటజీవితంలో పద్మవిభూషణ్ అవార్డు లాంటి అవార్డులు, ప్రత్యేక గౌరవ పురస్కారాలు అందుకున్నారు. తాజాగా ఆయన ఖాతాలోకి మరోక విశిష్ట గౌరవం చేరింది. అదే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన చోటు దక్కించుకున్నారు. చిరంజీవి తన సినిమా కెరీర్ లో 156 సినిమాలో 537 పాటల్లో 24 వేల స్టెప్పులు వేసి అలరించినందకు ఆయనకు ఈ అరుదైన రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ టీం, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ ఈ అవార్డును చిరంజీవికి ప్రదానం చేశారు. ఈ సందర్బంగా మెగా స్టార్ మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్బంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ముందుగా అమీర్ ఖాన్ అభినందించారు. ఈ రోజు అమీర్ ఖాన్ రాకతో ఈవెంట్ కు మరింత కళ వచ్చిందన్నారు. జీవితంలో ఈ రోజును అసలు మరిచిపోనున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరు ఎక్కడం తాను ఎప్పుడూ ఊహించలేదనీ, ఆ ఆలోచన కూడా తనకు లేదని అన్నారు మెగాస్టార్. తాను ఎదురు చూడని ఆనందం నేడు తన జీవితంలోకి వచ్చిందనీ, తన నట ప్రస్థానంలో ఇలా గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు రావడానికి కారణమైన దర్శక, నిర్మాతలకు, ముఖ్యంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు.

తనకు నటనపై కంటే.. డ్యాన్స్ మీద ఉన్న ఎక్కువ ఆసక్తే ఈ అవార్డు రావడానికి కారణమైందా? అనిపిస్తుందని అన్నారు. తాను నటనకు ఓనమాలు దిద్దే కంటే.. డ్యాన్స్ కే ముందు ఓనమాలు దిద్దనని అన్నారు. తన చిన్నతనంలో తన చుట్టు ఉన్నా వారికి ఎంటర్టైన్ చేయడానికి వేసిన చిందులేసేవాడిననీ, కాలేజ్ డేస్ లో ఖాళీ సమయాల్లో డ్యాన్స్ చేస్తూ తన చూట్టు ఉన్నావారిని ఎంటర్టైన్ చేసేవాడిననీ అన్నారు. అలా డ్యాన్స్ మీద ఆసక్తి పెరిగిందన్నారు. తన జీవితంలో ఓ అంతర్బాగంగా మారిపోయిందన్నారుచిరంజీవి.
ఈ సందర్బంగా తన తొలి సినిమా షూటింగ్ సమయంలో సంఘటనను పంచుకున్నారు. ఆ మూవీ షూటింగ్ ఖాళీ సమయంలో తాను వర్షంలో డ్యాన్స్ చేశాననీ, తన డ్యాన్స్ చూసి తన తోటి వారు చాలా మెచ్చుకున్నారన్నారు. ఈ విషయం దర్శక, నిర్మాతలకు కూడా తెలియడంతో.. ఆ తరువాత మూవీలో తన పాత్రకు డ్యాన్స్ చేసే అవకాశం లేకున్నా.. తన కోసం పాట పెట్టి తనను డ్యాన్ చేయించారన్నారు మెగాస్టార్ చిరంజీవి. తన డ్యాన్స్ తనకు అవకాశాలు తెచ్చిపెట్టిందన్నారు.
తాను నటించే సినిమాల్లో దర్శక, నిర్మాతలు గానీ, కొరియోగ్రాఫర్స్ గానీ, మ్యూజిక్ డైరెక్టర్ లు ప్రత్యేక శ్రద్దపెట్టేవారని అన్నారు. తన కోసం సినిమాల్లో ఆరు పాటలు పెట్టేవారని అన్నారు. తన డ్యాన్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసిందన్నారని చిరంజీవి పేర్కొన్నారు. ఈ అవార్డు కు అందుకోవడానికి కారణమైన వారందరి అభినందనలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటి వరకూ చిరంజీవి తన నట జీవితంలో 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు.


Click it and Unblock the Notifications











