twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Chiranjeevi: మరోసారి గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్.. అభిమాని చావుబతుకుల్లో ఉంటే అన్నీ తానై!

    |

    అభిమానులు లేనిదే సినిమా హీరోలు లేరు అలాగే సినిమా హీరోలు లేనిదే వాళ్ళ అభిమానులు ఉండరనేది వాస్తవం. ఒక రకంగా చెప్పాలంటే సినిమా హీరోలకు అభిమానులకు ఉన్న అవినాభావ సంబంధం వారికి తప్ప మరెవరికీ అర్థం కాదనే చెప్పాలి. అలా హీరోలకు బలం, బలహీనత రెండూ అభిమానులే అని చెప్పక తప్పదు. చిరంజీవి కూడా అందుకు ఏమాత్రం అతీతులు కారు. ఆయన తన అభిమానులు అంటే ప్రాణం ఇస్తారు. తాజాగా తన అభిమాని చావు బతుకుల్లో ఉన్న విషయం తెల్సుకుని ఆయన స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

     ఫ్యాన్ బేస్

    ఫ్యాన్ బేస్

    మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ బేస్ మరో హీరోకు లేదు అనడంతో ఏమాత్రం సందేహం లేదు. ఆయన మీద అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో చిరంజీవి కూడా వారి మీద అంతే ప్రేమ చూపిస్తారు. అందుకే ఆయన అభిమానులకు అండగా నిలుస్తూ ఉంటారు. తాజాగా కరోనా సమయంలో తన అభిమానులు కొంత మందికి చిరు అండగా నిలబడ్డారు.

     ఆర్థిక భ‌రోసా

    ఆర్థిక భ‌రోసా

    కరోనా సెకండ్ వేవ్ లో తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కరోనా బారిన పడి చనిపోయిన తన అభిమానుల కుటుంబాల‌కు మెగాస్టార్ చిరంజీవి కొన్నాళ్ల క్రితం ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాల‌కు చిరంజీవి ఆర్థిక భ‌రోసానిచ్చారు. ర‌క్త‌దాన కార్య‌క్ర‌మాలంటే ముందుండే అభిమానులలో ఎవరికి కరోనా సోకినా వెంటనే వారితో మాట్లాడి ధైర్యం నింపుతూ అవసరమైతే వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడమే కాక ఆయన ఆస్పత్రుల కు ఫోన్ చేసి డాక్టర్స్ తో కూడా మాట్లాడుతున్నారు.

     అండగా నిలబడి

    అండగా నిలబడి

    అలా కరోనా సెకండ్ వేవ్ లో కరోనా కారణంగా మరణించిన అందరూ అభిమానుల కుటుంబాలకు మాట్లాడి ధైర్యానిచ్చిన చిరంజీవి వారి అకౌంట్లలో డబ్బు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన వీరాభిమాని విషయంలో తీసుకున్న నిర్ణయం మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.

    పూర్తి వైద్య ఖర్చులను భరిస్తానని

    పూర్తి వైద్య ఖర్చులను భరిస్తానని

    గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న విశాఖపట్నం చెందిన మెగాభిమాని వెంకట్ అనారోగ్య విషయం అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు ద్వారా చిరంజీవి గారికి తెలిసింది. తెలుసుకున్న వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాల్సిందిగా మెగాస్టార్ కోరారు. పూర్తి వైద్య ఖర్చులను భరిస్తానని ఆయన మాటిచ్చారు. దీంతో వెంకట్ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది.

    Recommended Video

    Megastar Chiranjeevi Special Interview with Natyam Movie Team
     సినిమాల విషయానికి వస్తే

    సినిమాల విషయానికి వస్తే

    ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన నటించిన ఆచార్య విడుదలకు సిద్ధమవుతుంది.. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' సెట్స్‌పై ఉంది. వీటితో పాటు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వస్తున్న బోళా శంకర్, బాబీలతో సినిమాలు చేయాల్సి ఉండగా.. వీటిలో ముందుగా బాబీ సినిమానే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాను చిరంజీవి దీపావళి సందర్భంగా నవంబరు 6న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    English summary
    as per reports megastar chiranjeevi to pay hospital bills of his ardent fan venkat suffering with cancer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X