మీ కుటుంబ సభ్యుడిగా ఇదే నా మనవి.. చిరు ట్వీట్ వైరల్!

Chiranjeevi's tweet:గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద నీరు బీభత్సం స్రుష్టిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుండపోతగా వర్షాల వల్ల ప్రధానంగా ఏపీలోని కోస్తా జిల్లాలు ప్రభావితమతున్నాయి. అక్కడి ప్రజలు నానా కష్టాలు పడుతూ తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అదేరీతిలో హైదరాబాద్‌, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో పలు ప్రాంతాలు వర్షపు నీటితో జలమయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు తెలంగాణలోని 11 జిల్లాల్లో, అటు ఏపీలోని 8 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేశారు. దీంతో ప్రభుత్వ, అధికార యంత్రాంగం సహాయకచర్యల వేగవంతం చేసింది. అలాగే ఈ ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పలు చోట్ల రహదారులు, రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. సముద్రాలను తలపిస్తున్నాయి. దీంతో పలు రైళ్లు కూడా రద్దయ్యాయి.

ఈ క్రమంలో భారీ వర్షాల వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఆయన తన ఎక్స్ వేదికలో ఇలా పోస్ట్ చేశారు. 'తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను' అని మెగాసార్ట్ చిరు ప్రజలకు విన్నపం చేశారు.

Megastar Chiranjeevi tweet on heavy rains in telugu states

అలాగే.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ప్రజలకు విన్నపం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు అందించాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు తెలిపారు. అలాగే.. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలను పాల్గొనాలని సూచించారు. ఆహారం, రక్షిత తాగునీరు, వైద్య సహాయం అందించడంలో తోడ్పాటు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ సూచించారు.

విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటన తెలిసి విచారానికి లోనయ్యానని అన్నారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటన దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ . ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలందిస్తుందని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఆదివారం తెలుగురాష్ట్రాల్లోని పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. .

More from Filmibeat

Read more about: chiranjeevi floods pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X