Mega 154: మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే మరో గుడ్ న్యూస్.. ఆ రోజే పవర్ఫుల్ అప్డేట్!
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచార్య సినిమాతో ఊహించిన విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో మొత్తానికి మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక వీకెండ్ తర్వాత కూడా అదే తరహాలో మెగాస్టార్ రికార్డులు క్రియేట్ చేసే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇక గాడ్ ఫాదర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న 154 సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.
మాస్ కమర్షియల్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఆ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పటివరకు అధికారికంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ తప్పకుండా పొంగల్ ఫెస్టివల్ లో మెగాస్టార్ సినిమా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఇంతవరకు అప్డేట్ ఇవ్వలేదు.

అందుకే త్వరలోనే ఆ విషయంలో కూడా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అంతేకాకుండా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్ విడుదల చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న టాక్ కరమైతే ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అయితే అనుకుంటున్నారు.
ఇక సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక సంక్రాంతికి మరికొన్ని పెద్ద సినిమాలు కూడా పోటీగా రానున్నాయి. అందులో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ కానుంది. అలాగే విజయ్ వారసుడు సినిమా కూడా తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతోంది. మరి ఈ బాక్సాఫీస్ ఫైట్ లో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











