మెగాస్టార్ వెనుకే టాలెంటెడ్ దర్శకుల క్యూ.. సరికొత్త కథలతో మొత్తం అరడజను మంది..
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు ఆయన అభిమానులు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సైరా, ఆచార్య సినిమాల కోసం నాలుగేళ్ల దాకా టైం తీసుకున్నారు. ఆ తర్వాత ఉన్నట్లుండి స్పీడు పెంచేశారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాలను నాలుగు నెలల వ్యవధిలోనే రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఆ తర్వాత భోళా శంకర్ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ చిత్రం షూటింగ్ ను త్వరగా చేసేందుకు చేయాల్సిన అన్ని పనులను చేస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత వచ్చే చిత్రంపై అందరిలోనూ సందిగ్ధత నెలకొంది. ముందుగా అనుకున్న ప్రకారం అయితే వెంకీ కుడుముల సినిమా చేయాల్సి ఉంది. కానీ స్క్రిప్టు విషయంలో చిరు సాటిస్ ఫై కాకపోవడంతో వెంకీ నితిన్ తో ఓ సినిమా చేస్తున్నారు. మరి నెక్స్ట్ మూవీ ఎప్పుడు, ఎవరితో వస్తుందనే టెన్షన్ మొదలైంది.

ఇంకో రెండు నెలలో భోళా శంకర్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. ఆలోపు చిరు కొత్త ప్రాజెక్టు ఓకే కావాల్సి ఉంది. చిరు ఏదో ఓ కథకు ఓకే చెప్పకుండా తనకు నచ్చి, హిట్టువుతుందనుకున్న కథలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఓ నలుగురు రచయితలు చిరు కోసం కథలు రాస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే, ధమాకా చిత్రాలకు కథలు రాసి హిట్లు కొట్టిన ప్రసన్నకుమార్ బెడవాడ.. చిరు కోసం మూడు కథలు రాస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో చిరుకి ఏది నచ్చితే అది ఇచ్చేస్తారట. అయితే చిరుకు నచ్చిన డైరెక్టర్ తో ఆ సినిమా చేయిస్తారట. మరోవైపు సీనియర్ రైటర్ బీవీఎస్ రవి కూడా చిరు కోసం ఓ స్పెషల్ స్టోరీ రాస్తున్నట్లు సమాచారం.
మరోవైపు సోగ్గాడే చిన్నినాయనా, బింబిసార దర్శకులు కూడా చిరుకు కథ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే చిరు హామీతో పూరి జగన్నాథ్, వివి వినాయక్ కూడా మెగాస్టార్ కోసం కథలు రెడీ చేసే పినిలో ఉన్నారు. పూరి సొంతంగా ప్రయత్నిస్తుంటే వినాయక్ రైటర్ల మీద ఆధార పడుతున్నారు. మరి ఈ అరడజను మందిలో ఎవరు తమ కథతో చిరును మెప్పిస్తారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











