ప్రచారమే నిజమైంది.. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ప్రకటన.. ఈ సారి అభిమానితో!

మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకు వెళుతున్నారు. ఇప్పటికే మూడు సినిమాలు చేస్తున్న ఆయన మరో సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

 ఆచార్య విడుదల కోసం

ఆచార్య విడుదల కోసం

రాజకీయాలకు రామ్ రామ్ చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. తొలుత వీవీ వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత తనకి చిరకాల కోరిక అయిన సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో షూటింగ్ పూర్తి చేసిన ఆయన ఆ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.

వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కాబోతోంది. ఇవి కాక మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్', మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్', అలాగే బాబీ దర్శకత్వంలో చిరు 154 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. దానికి వాల్తేరు వీరయ్య అనే పేరు ప్రచారంలో ఉంది.

ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్

ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్

ఇక అలా ఆయన డిసెంబర్‌ నెలలో నాలుగు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. ఈ మెగా ఫీట్‌ను మెగాభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రెండ్ కూడా చేశారు. మెగాస్టార్ 152, మెగాస్టార్ 153, మెగాస్టార్ 154, మెగాస్టార్ 155 చిత్రాల్లోని ప్రీలుక్స్‌ను కలిపి ఒక పోస్టర్‌లా డిజైన్ చేసి షేర్ చేసి ఆసక్తి రేకెత్తించారు.

కొత్త సినిమా అధికారికంగా

కొత్త సినిమా అధికారికంగా

కొత్త సినిమా అధికారికంగా ఇదిలా ఉండగా ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా చిరంజీవి.. తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‏కు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. ముందు నుంచి వినిపిస్తున్నట్టుగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కించబోయే సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

మెగాస్టార్ ఫ్యాన్

మెగాస్టార్ ఫ్యాన్

ఇక మెగాస్టార్ ఫ్యాన్ ను అని చెప్పుకునే వెంకీ కుడుముల ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక 'ఆచార్య' వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది. అలాగే సమ్మర్‌ లో 'గాడ్ ఫాదర్' విడుదలకు సిద్ధం అవుతోంది. భోళా శంకర్, బాబి దర్శకత్వంలో తెరకెక్కే వాల్తేరు వీరయ్య కూడా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద కొత్త సినిమా ప్రకటనతో అయితే మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మెగా అభిమానులు అందరూ వరస సినిమాలతో ఉక్కిరి బిక్కిరి కానున్నారు అని చెప్పక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X