భార్యతో కలిసి ప్రత్యేక విమానంలో మెగాస్టార్ టూర్.. ఎక్కడికి వెళ్ళారో తెలుసా?
ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమాతో మిశ్రమ ఫలితాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి వెకేషన్ కు వెళుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా కాలం తర్వాత వారిద్దరూ ఇలా ఏకాంతంగా బయటకు వెళుతున్నట్లు తెలియడంతో అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఎక్కడికి వెళ్లారు? అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

ఏప్రిల్ 29వ తేదీన
తొలుత రాజకీయాల్లోకి వెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరా నరసింహారెడ్డి సినిమా చేసి ఆ కల కూడా తీర్చుకున్నారు.. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ కీలక పాత్రలో నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

మిశ్రమ స్పందన రావడంతో
అయితే ఈ సినిమా మొదటి ఆట నుంచి మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్స్ విషయంలో మొదటి రోజు మంచి జోరు చూపించినా తర్వాత నుంచి కలెక్షన్లలో దారుణంగా డ్రాప్ కనిపిస్తోంది. అయితే జయాపజయాలను ఒకే విధంగా భావించే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన భార్య సురేఖతో కలిసి విదేశీ పర్యటనకు బయలు దేరారు. కరోనా హడావిడి మొదలైన తర్వాత మొట్ట మొదటి ఇంటర్నేషనల్ ట్రిప్ కి వెళ్తున్నాము అని చెబుతూ మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ప్రత్యేక విమానంలో ఉన్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అమెరికా, యూరప్ దేశాలకు
తాము అమెరికా, యూరప్ దేశాలకు వెళ్ళ బోతున్నామని మెగాస్టార్ చిరంజీవి అందులో పేర్కొన్నారు. ఇక చాన్నాళ్ల తర్వాత వీరిద్దరూ ఏకాంతంగా బయటకు వెళ్లడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ఇప్పటికే ఆయన మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేస్తున్నారు.

ప్రత్యేక పాత్రలో
మోహన్ రాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సత్య దేవ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక నయనతార మెగాస్టార్ చిరంజీవికి సోదరి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. చిరంజీవి సల్మాన్ ఖాన్ చేత డాన్స్ చేయించేందుకు ప్రభుదేవా రంగంలోకి దిగినట్లు తాజాగానే ప్రకటన వచ్చింది. మరోపక్క మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం సినిమా రీమేక్ గా భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నారు.

అందుకే విదేశాలకు
ఈ సినిమా కూడా కొంతమేర షూటింగ్ జరుపుకుంది. ఇవి కాక ఆయన బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతానికి హైదరాబాదు లో ఎండలు బాగా పెరిగి పోవడం వల్ల ప్రస్తుతం తను విదేశాల్లో కాస్త చల్లటి వాతావరణం ఉంటుందని భావించడంతో మెగాస్టార్ చిరంజీవి తన భార్యతో కలిసి పర్యటనకు బయలుదేరారు అని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











