మెగాస్టార్ చిరంజీవి టాప్ 10 సాంగ్స్.. క్లాస్ అయినా, రాక్ అయినా బాస్ స్టెప్ వేస్తే!

మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆయన స్థానం సంపాదించారు. 155 సినిమాలలో, అత్యధిక పాటల్లో డ్యాన్సులు చేసినందుకు గాను ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. చిరు కాలు కదిపితే సినిమా థియేటర్లు దద్ధరిల్లిపోయేవి, డ్యాన్స్ అంటే మెగాస్టార్.. మెగాస్టార్ అంటే డ్యాన్స్ అన్నంతగా చిరు బలమైన ముద్ర వేశారు. తెలుగులోనే కాదు.. యావత్ ఇండియన్ మూవీ హిస్టరీలోనే డ్యాన్స్‌కి ఐకాన్‌గా నిలిచారు చిరు. ఈ నేపథ్యంలో చిరంజీవి కెరీర్‌లో అద్భుతమైన డ్యాన్స్‌లు వేసిన సినిమాలెన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే :

రగులుతోంది మొగలిపొద - ఖైదీ

చిరంజీవిని సుప్రీం హీరోగా నిలబెట్టిన మూవీ ఖైదీ. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్‌గా ఎదిగారు. ఈ మూవీలోని రగులుతుంది మొగలిపొద సాంగ్‌లో హీరోయిన్ మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్. ఆ పాటను ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని ఇదే తరహాలో ఎన్నో పాటలు వచ్చినా చిరు - మాధవీల గ్రేస్ ముందు అవేవి నిలబడలేకపోయాయి.

Megastar Chiranjeevi s Top 10 Songs Here is classic melodious rock break songs list

చక్కని చుక్క - పసివాడి ప్రాణం

1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన పసివాడి ప్రాణం చిత్రంతో తెలుగు సినిమాకు బ్రేక్ డ్యాన్స్‌ను పరిచయం చేశారు చిరంజీవి. ఇందులోని చక్కని చుక్కలా బ్రేక్ డ్యాన్స్ అంటూ సాగే పాటలో విజయశాంతితో కలిసి చిరు వేసిన స్టెప్స్‌ని నాటి తరం మరిచిపోలేదు. ఇప్పటికీ ఈ పాట వస్తే ఎవరైనా కాలు కదపాల్సిందే.

హే పాప - త్రినేత్రుడు

1988లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన త్రినేత్రుడిలోని హే పాప అంటూ వచ్చే డ్యాన్స్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్సింగ్ స్కిల్స్‌ను చూపించారు. ఈ సినిమాలో భానుప్రియ హీరోయిన్. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో ఆమె చిరుతో సమానంగా స్టెప్స్ ఇరగదీసింది

Megastar Chiranjeevi s Top 10 Songs Here is classic melodious rock break songs list

పదహరేళ్ల వయసు - లంకేశ్వరుడు

1989లో దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన లంకేశ్వరుడు మూవీలోని పదహరేళ్ల వయసు పడిపడి లేచే మనసు సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ ఎన్నిసార్లు చూసినా థ్రిల్‌గా అనిపిస్తాయి. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది.

గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్

1991లో విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.

బంగారు కోడిపెట్ట - ఘరానా మొగుడు

1992లో కే . రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఘరానా మొగుడు చిరంజీవి ఇమేజ్‌ని శిఖరాగ్రానికి చేర్చింది. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. టాలీవుడ్‌లో రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఘరానా మొగుడుకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని, భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. అప్పటి పత్రికలు మెగాస్టార్‌ని బిగ్గర్ దెన్ బిగ్‌ బీ అంటూ కీర్తించాయి. ఘరానా మొగుడులోని బంగారు కోడిపెట్ట కోసం ప్రభుదేవా కంపోజ్ చేసిన మూవ్‌మెంట్స్‌కి చిరు తన డ్యాన్స్ , హావభావాలతో ఎవర్ గ్రీన్ సాంగ్‌గా తీర్చిదిద్దారు.

నడక కలిసిన నవరాత్రి - హిట్లర్

1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన హిట్లర్ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్ . దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. కోటి సంగీత స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చిరు వేసిన స్టెప్స్‌ని ఎప్పటికీ మరిచిపోలేం. హీరోయిన్ రంభ చిరుతో సమానంగా డ్యాన్స్ చేసి మంచి పేరు తెచ్చుకుంది.

Megastar Chiranjeevi s Top 10 Songs Here is classic melodious rock break songs list

దాయి దాయి దామ్మ - ఇంద్ర

చిరంజీవి డ్యాన్సింగ్ స్కిల్స్‌ను మరో మెట్టెక్కించింది ఈ పాట. 2002లో బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఇంద్ర సినిమాలోని దాయి దాయి దామ్మ పాటలో చిరు వేసిన వీణ స్టెప్.. ఆల్ టైమ్ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్స్‌కు చిరు తన గ్రేస్‌తో మెమొరబుల్‌గా మార్చారు.

మన్మథ మన్మథ - ఠాగూర్

2002లో వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని మన్మథ మన్మథ మామ పుత్రుడా పాటలో వీణ స్టెప్ మాదిరిగా చిరంజీవి చేసిన డ్యాన్స్ ఎవర్ గ్రీన్. లారెన్స్ కొరియోగ్రఫి చేయగా, మణిశర్మ స్వరాలు సమకూర్చారు. హీరోయిన్ శ్రీయ కూడా చిరుతో సమానంగా డ్యాన్స్ చేసింది.

యూ అండ్ మీ - ఖైదీ నెంబర్ 150

రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు చిరంజీవి. 2017లో వీవీ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెం 150లోని యూ అండ్ మీ సాంగ్‌లో షూకి లేసులు కడుతూ చిరంజీవి చేసిన స్టెప్స్‌ అదిరిపోయాయి. 60 ప్లస్‌లోనూ చిరంజీవి తనలో గ్రేస్ తగ్గలేదని నిరూపించారు.

More from Filmibeat

Read more about: megastar chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X