Varuntej Lavanya Prewedding: చిరు ఇంట మొదలైన పెళ్లి వేడుకలు - వరుణ్, లావ్ ప్రీ వెడ్డింగ్ లో మెగా ఫ్యామిలీ
Varuntej Lavanya Prewedding: మెగా ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. త్వరలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. శుక్రవారం రోజు సాయంత్రం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో కేవలం మెగా కుటుంబీకులు మాత్రమే పాల్గొన్నారు. అయితే ఈ విషయాన్ని నేరుగా మెగాస్టార్ చిరంజీవియే తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. వరుణ్ తేజ్ లావణ్యల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నిన్న సాయంత్రం ఘనంగా జరిగాయంటూ రాసుకొచ్చారు. అందులో వరుణ్ తేజ్ బ్లాక్ డ్రెస్సులో లావణ్య వైట్ అండ్ యెల్లో డ్రెస్సులో అదిరిపోయారు.
కేవలం మెగా కుటుంబ సభ్యుల నడుమే ఈ వేడుకలు జరపగా.. అందరూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, సాయిధరమ్ తేజ్, నిహారిక, నాగబాబు, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, సుస్మిత కొణిదెల, శ్రీజ కొణిదెలు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి, సురేఖలతో పాటు నాగబాబు, పద్మజ దంపతులు, చిరంజీవి తల్లి అంజనా దేవి, చిరింజీవి ఇద్దరు చెల్లెల్లు, వారి భర్తలు, పిల్లలు ఈ కార్యక్రమానికి హాజరై నూతన జంటకు అభినందనలు తెలిపారు. అయితే పుష్ప-2 షూటింగ్ బిజీ వల్లే అల్లు అర్జున్ రాలేకపోయినట్లు సమాచారం.

చిరంజీవి ఈ ఫొటోలను షేర్ చేసిన గంటలోపే లక్షల్లో లైకులు, వందల్లో కామెంట్లు వచ్చాయి. అలాగే మెగా అభిమానులంతా ఈ ఫొటోలను తెగ షేర్ చేసేస్తున్నారు. ఎక్కడ చూసినా వీరి ఫొటోలే దర్శనం ఇస్తున్నాయి. మీరూ ఓ సారి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫొటోలు చూడండి. వీటిని చూస్తే అందంగా ముస్తాబైన కొత్తజంటతో పాటు మెగా ఫ్యామిలీ కుంటబ సభ్యులందరినీ ఒకే ఫొటోలో వీక్షించవచ్చు. ఇటీవలే వరుణ్ తేజ్ తన స్నేహితులందరికీ బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. స్పెయిన్ లో చాలా గ్రాండ్ గా తన 40 మంది మిత్రులకు గట్టిగా దావత్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ వేడుకల్లో సాయి ధరమ్ తేజ్ తో పాటు వైష్ణవ్ తేజ్ కూడా పాల్గొన్నారు.

మిస్టర్ సినిమా కోసం తొలిసారిగా కలిసి పని చేసిన లావణ్య, వరుణ్ లు అప్పుడే స్నేహితులయ్యారు. వారిద్దరి మధ్యా మంచి బంధం ఏర్పడి.. అది చాలా కాలం పాటు కొనసాగింది. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసుకున్న వీరు.. 2018లో వచ్చిన అంతరిక్షం సినిమా కోసం మరోసారి కలిసి పని చేశారు. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఆ తర్వాత చాలా రోజుల పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట ఇటీవలే ఇరు కుటుంబ సభ్యులకు విషయం చెప్పి ఒప్పించారు. పెద్దల ఆంఘీకారంతో ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఎంగేజ్ మెంట్ లాగే పెళ్లి కూడా సింపుల్ గానే చేసుకుంటామని ఇటీవలే వరుణ్ తేజ్ వివరించాడు.
శుక్రవారం రోజు వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలు అవడంతో అంతా పెళ్లి ఎప్పుడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెలలోనే వీరి పెళ్లి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది బంధువుల మధ్య వీరి పెళ్లి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ ప్రేమ పక్షలు ఏరోజున మూడు మళ్ల బంధంతో ఒకటవుతాయో.


Click it and Unblock the Notifications











