ఊరు పులకించిపోతుంది.. జస్టిస్ ఎన్వీ రమణకు చిరంజీవి స్పెషల్ నోట్

ఈరోజు తెలుగు తేజం జస్టిస్ నూతలపాటి వెంకట రమణ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో తెలుగు వారంతా ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఎత్తున సోషల్ మీడియాలో కూడా ఆయనకు ఈ మేరకు పెద్ద శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి జస్టిస్ ఎన్ వి రమణకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు. తెలుగువారికి గర్వకారణం అయిన శ్రీ ఎన్వీ రమణ గారు ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.

అందానికి అందంగా ఈ పుత్తడి బొమ్మ... ప్రియా భవానీ శంకర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ

ఆయన 40 ఏళ్ల కెరీర్ కు ఇది అత్యున్నత స్థానం అని చిరంజీవి చెప్పుకొచ్చారు.. 55 ఏళ్ల తర్వాత ఆయన ఈ గౌరవాన్ని రెండో తెలుగువాడిగా దక్కించుకోవడం తనకు ఆనందం కలిగిస్తోందని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ గొప్ప అవకాశానికి ఆయన పుట్టిన నేల కూడా ఆనందిస్తోంది అని చెప్పుకొచ్చారు. అలాగే ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు అంటూ చిరంజీవి పేర్కొన్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడు శ్రీ రమణ గారు అని పేర్కొన్నారు.

Megastar congratulates NV Ramana for taking oath as new CJI

అత్యున్నత న్యాయస్థానంలో 55 సంవత్సరాల తర్వాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుంది అంటూ చిరంజీవి ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు. ఇక మరోపక్క ఈ రోజు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పుట్టినరోజు కావడంతో చిరంజీవి ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని లక్షల మంది హృదయాలలో నిలిచిపోయిన సచిన్ మరిన్ని హృదయాల్లో స్థానం సంపాదించాలని చిరంజీవి కోరారు. అలాగే ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చిరంజీవి కోరారు. ఇక తామిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను కూడా చిరంజీవి ఈ సందర్భంగా షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X