మెగాస్టార్ సినిమాలో యువ హీరో.. ఆ పాత్ర కోసం మరో చేంజ్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ స్థాయి పెరిగే విధంగా రాబోయే రోజుల్లో ఎన్నో ఆసక్తికరమైన సినిమాలు రాబోతున్నాయి. ఒకరిని మించి మరొకరు వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్నారు. వయసు పెరుగుతున్నా కూడా సీనియర్ హీరోలు అయితే ఏ మాత్రం గ్యాప్ లేకుండా కష్టపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఆరు పదుల వయసులో కూడా నాలుగు సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకు రావడానికి జెట్ స్పీడ్ లో సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు అభిమానులనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అసలైతే ఆచార్యను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువ కావడం వలన వచ్చే సమ్మర్లో విడుదల చేయాల్సి వస్తోంది.

Megastar god father Satyadev role replace rumours

ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సరసన మరోసారి నయనతార స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇదివరకే వీరి కాంబినేషన్లో సైరా సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో హీరో సత్యదేవ్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు ఇది వరకే అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

మెగాస్టార్ కూడా బ్లఫ్ మాస్టర్ చూసి సత్యదేవ్ కు ఆ పాత్ర చేసే అవకాశం ఇచ్చాడు. అతను మాత్రమే ఆ క్యారెక్టర్ కు న్యాయం చేయగలడని మరికొంత మంది సలహా ఇవ్వడంతో మెగాస్టార్ డైరెక్టర్ మోహన్ రాజాను కూడా ఒప్పించాడు. అయితే దర్శకుడు మోహన్ రాజా మొదట ఒక తమిళ హీరోను సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నాడట. ఇటీవల కొన్ని చర్చలు కూడా జరిగాయి అని తెలుస్తోంది. ఇక సత్యదేవ్ గాడ్ ఫాదర్ సినిమాలో నటించకపోవచ్చు అనే కథనాలు కూడా వెలువడ్డాయి. మళ్ళీ మార్పులు చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ అయితే వచ్చాయి.

Megastar god father Satyadev role replace rumours

అయితే అందులో ఎలాంటి నిజం లేదని ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు కాబట్టి మళ్ళీ ప్రణాళికలతో మారిస్తే మరికొంత సమయం వృధా అయినట్లే. ఇక సత్యదేవ్ తప్పించడానికి పెద్దగా కారణాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే అతని టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. తప్పకుండా ప్రేక్షకుల్లో కూడా అతని పాత్ర పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలో హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అందుకున్న సత్యదేవ్ కు బాలీవుడ్ నుంచి కూడా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X