పుష్ప సినిమా చూసిన తరువాత మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఏమిటంటే..?

అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది. కానీ సినిమా ఇంకా అనుకున్నంత స్థాయిలో అయితే బ్రేక్ సాధించలేకపోయింది. ప్రస్తుతం కలెక్షన్స్ అయితే స్టాండర్డ్ గానే ఉన్నాయి. కానీ అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు కలెక్షన్స్ పెంచేందుకు గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.

ఇక మొత్తానికి సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులు మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పాత్ర పై అభిమానుల్లో చాలా సంతోషంగా ఉన్నారు. కానీ సుకుమార్ తన స్థాయికి తగ్గట్టుగా సినిమాలు తెరపైకి తీసుకురాలేకపోయారు అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ఇక ఈ సినిమాను చూసిన కొంతమంది సినీ ప్రముఖులు చాలా పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకమైన షోలను వీక్షించారు. సినిమా చూడగానే మెగాస్టార్ చాలా పాజిటివ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ ని ప్రత్యేకంగా కలుసుకున్న మెగాస్టార్ సినిమా చేసిన తరువాత మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారట.

Megastar reaction after Pushpa movie watched

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఎవరు మంచి సినిమాలు చేసినా కూడా వెంటనే తనదైన శైలిలో సపోర్టు ఇస్తూ ఉంటారు. చిన్న దర్శకులు పెద్ద దర్శకులు అని తేడా లేకుండా ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఇక సుకుమార్ అంటే కూడా మెగాస్టార్ చిరంజీవి చాలా ప్రత్యేకమైన గౌరవం అనే చెప్పాలి. రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ లోని సరికొత్త నటుడిని చూపించడంతోనే ఆయన మనసు గెలుచుకున్నారు. ఇక సుకుమార్ ఆ తర్వాత చేసిన పుష్ప సినిమాపై కూడా మెగాస్టార్ మొదటి నుంచి కూడా పాజిటివ్ గానే ఉన్నారు.

పుష్ప సినిమాలు చూడాలని ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ మిగతా సినిమాలతో బిజీగా ఉండటం వలన బ్రేక్ దొరకలేదు. మొత్తానికి ఇటీవల సుకుమార్ తో ఆయన ప్రత్యేకంగా సినిమాను చూసేశారని అర్ధమయ్యింది. పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రెండు వందల కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ అందుకుంది. కానీ ఇంకా పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా కలెక్షన్స్ అయితే రాలేవు. తప్పకుండా బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన అవసరం అయితే ఉంది.

అందుకే చిత్ర యూనిట్ సభ్యులు కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. మళ్లీ మరొక ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప సినిమా రెండో భాగాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. మరి ఆ సినిమాతో అయినా సుకుమార్ ఆడియెన్స్ ను పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X