మెగాస్టార్ చెప్పాడు.. బన్నీ పాటించాడు.. ఇక ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సిందే!
మెగా హీరోలు చేసే కథలపై నిత్యం చర్చలు జరుపుతూనే ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ప్లాప్స్ వచ్చినప్పుడు మెగా యువ హీరోలు నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్టులు సెట్ చేసుకోబోతున్నారు అనే దానిపై కూడా ఆరా తీస్తూ ఉంటారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల మెగాస్టార్ బన్నీ కోసం ఒక కథ సెట్ చేశాడట. మామయ్య చెప్పగానే బన్నీ కూడా దానికి ఒప్పుకున్నాడట.
అసలైతే అల్లు అర్జున్ మరో ఎడాది వరకు వేరే దర్శకులకు మాట ఇవ్వకూడదని అనుకున్నాడు. ఎందుకంటే పూర్తిగా తన దృష్టిని పుష్ప సినిమాపైనే పెట్టనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం చాలా కష్టపడాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి పూర్తిగా అదే సినిమాపై దృష్టి పెట్టాడు. ఇక ఆ తరువాత వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే సినిమా చేయనున్నాడు. ఐకాన్ కోసం కూడా పూర్తిగా డిఫరెంట్ లుక్ తో కనిపించబోతున్నాడు.

అందుకే మరో దర్శకుడిని వెయిట్ చేయించకుండా ఆ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తరువాతే బన్నీ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ కొరటాల శివ చెప్పిన కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదట. బన్నీకి ముందే ఆ కథ గురించి తెలిసినప్పటికి ఎందుకో గట్టిగా ఆన్సర్ ఇవ్వలేకపోయాడట.
కానీ చిరంజీవి అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పడంతో ఫైనల్ గా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొరతల శివ మెగాస్టార్ తో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప అనంతరం ఐకాన్ సినిమాతో పాటు కొరటాల సినిమాను కూడా బన్నీ ఒకేసారి స్టార్ట్ చేయనున్నాడట.


Click it and Unblock the Notifications











