గోవాలో నగ్వత్వ ప్రదర్శన.. పూనమ్ పాండే అరెస్ట్ తర్వాత.. ప్రముఖ నటుడిపై కేసు

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ మరోసారి వివాదంలో చిక్కుకొన్నారు. తన 55వ బర్త్ డే రోజ వేడుకను మిలింద్ సోమన్ తన భార్యతో కలిసి గోవాలో జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గోవా బీచ్‌లో నగ్నంగా పరిగెత్తి వార్తల్లో సంచలనంగా మారారు. బీచ్‌లో నగ్నంగా పరిగెత్తుతూ దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. హ్యాపీ బర్త్ డే టు మీ. 55వ వయసులో కూడా భూమిపై పరుగెడుతున్నాను అంటూ కామెంట్ చేశాడు. ఆయన పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.

అయితే మిలింద్ సోమన్ నగ్నంగా పరుగెత్తడంపై గోవా పోలీసులు తీవ్రంగా స్పందించారు. మిలింద్‌పై అసభ్యత, అశ్లీలత అంశాలపై సౌత్ గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన విషయంపై దక్షిణ గోవా ఎస్పీ పంకజ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

Milind Soman nude Run in Beach: Goa police files FIR on top model

మిలింద్ సోమన్‌పై ఐపీసీ సెక్షన్ 294 ప్రకారం కేసు నమోదు చేశాం. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కూడా కొన్ని సెక్షన్లు విధించాం అని పంకజ్ కుమార్ వెల్లడించారు. అయితే తనపై కేసు నమోదు కావడంపై స్పందించడానికి మిలింద్ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

గోవాలో సినీ ప్రముఖులపై గతవారం కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. రెండు రోజుల క్రితం గోవా బీచ్‌లో శృంగారం ఒలకబోసిందుకు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దాంతో ఆమె కనకోనా కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. న్యాయమూర్తి మంజూరు చేశారు. గోవా బీచ్‌లో అసభ్యకరమైన వీడియో షూట్ చేశారనే ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేయడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X