బీచ్‌లో నగ్నంగా పరిగెత్తిన ప్రముఖ నటుడు.. గతంలోను టాప్ హీరోయన్‌తో న్యూడ్‌గా..

బాలీవుడ్ నటుడు, 80, 90వ దశకాల్లో టాప్ మోడల్‌గా రాణించిన మిలింద్ సోమన్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన 55వ పుట్టిన రోజున నగ్నంగా పరిగెత్తడం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమైంది. ఇప్పుడు మిలింద్ వ్యవహారంలో ఆయన గతంలో చేసిన పనులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. మిలింద్ సోమన్ ప్రొఫెషనల్, వ్యక్తిగత జీవితనాన్ని పరిశీలిస్తే..

27 సంవత్సరాల యువతితో పెళ్లి

27 సంవత్సరాల యువతితో పెళ్లి

మిలింద్ సోమన్‌కు వివాదాస్పద వార్తల్లో కొత్తేమీ కాదు. ఆయన తన కంటే అతి తక్కువగా వయసులో ఉన్న నటితో ప్రేమాయాణం సాగించడం ఇటీవల కాలంలో చర్చనీయాంశమైంది. తన వయసు 55 సంవత్సరాలు కాగా, భార్య అంకితా కన్వర్ వయసు 27 సంవత్సరాలే. తన వయసులో సగం కంటే తక్కువగా ఉన్న అంకితతో రిలేషన్ షిప్‌ గురించి స్పందిస్తూ.. వయసు అనేది ఒక నంబర్ మాత్రమే. ప్రేమకు అలాంటి పరిమితులు లేవు అంటూ మిలింద్ సోమన్ కామెంట్ చేశాడు.

మధు సప్రేతో న్యూడ్ ఫోటో షూట్

మధు సప్రేతో న్యూడ్ ఫోటో షూట్

ఇక 90వ దశకం ఆరంభంలో మిలింద్ సోమన్ మోడలింగ్ రంగంలో సంచలనం రేపారు. బాలీవుడ్ నటి మధు సాప్రేతో కలిసి కండోమ్ యాడ్‌ కోసం దిగంబరంగా మారారు. ఆ న్యూడ్ ఫోటోషూట్ ప్రముఖ మ్యాగజైన్‌పై రావడంతో ఆప్పట్లో పెను సంచలనం రేపింది. మిలింద్, మధుసాప్రేతో కలిసి నగ్నంగా కొండ చిలువను మెడలో వేసుకొని నటించడం అప్పట్లో సెన్సేషన్‌గా మారింది.

గోవా బీచ్‌లో నగ్నంగా పరిగెత్తుతూ

గోవా బీచ్‌లో నగ్నంగా పరిగెత్తుతూ

తాజాగా తన 55వ బర్త్ డే రోజ వేడుకను మిలింద్ సోమన్ తన భార్యతో కలిసి గోవాలో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా గోవా బీచ్‌లో నగ్నంగా పరిగెత్తాడు. ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే టు మీ. 55వ వయసులో కూడా భూమిపై పరుగెడుతున్నాను అంటూ కామెంట్ చేశాడు. ఆయన పోస్టుపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

 మిలింద్ సోమన్ కెరీర్ ఇలా

మిలింద్ సోమన్ కెరీర్ ఇలా

మిలింద్ సోమన్ కెరీర్ విషయానికి వస్తే.. పలు టెలివిజన్ షోలలో, మోడలింగ్ ప్రాజెక్టులు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫోర్ మోర్ షాట్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌లో సయానీ గుప్తాతో కలిసి నటించారు. కెప్టెన్ వ్యోమ్ అనే టెలివిజన్ సిరీస్‌లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X