twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa ను వాడేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇది కదా క్రేజ్.. తగ్గేదేలే అంటూ!

    |

    అల్లు అర్జున్ పుష్ప ఫీవర్ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే, దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులోనే కాక ఈ సినిమా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల కావడంతో దేశ వ్యాప్తంగా పుష్ప రాజ్ హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది సినిమా బాగుందని చెప్పగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ పుష్ప క్రేజ్ ను వాడుకుంటోంది. అది కూడా కరోనా విషయంలో.. అదేంటో చూద్దామా

    టాక్ ఆఫ్ ది ఇండియా

    టాక్ ఆఫ్ ది ఇండియా

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప ది రైజ్. సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా సంచలన విజయాలు సాధిస్తోంది. తెలుగు తో పాటు ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దీంతో బన్నీ టాక్ ఆఫ్ ది ఇండియా అయిపోయాడు.

     అనేక ఆంక్షలు

    అనేక ఆంక్షలు

    బన్నీ నటించిన ఈ మూవీ ఉత్తరాదిలో రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్ ను కూడా విస్మయానికి గురి చేసింది. అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా తగ్గేదేలే అనే డైలాగ్, మ్యానరిజం వైరల్ అవుతూనే ఉంది. ఇక కోవిడ్-19 కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ ఇప్పుడు దావానంలా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కారణంగా నైట్ కర్ఫ్యూ విధించగా మరికొన్ని రాష్ట్రాల్లో అనేక ఆంక్షలు విధిస్తున్నారు.

    #IndiaFightsCorona నినాదంతో

    #IndiaFightsCorona నినాదంతో

    అంతే కాక ఈ వైరస్ మీద ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అధికారులు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ #IndiaFightsCorona నినాదంతో ప్రజలు పాటించాల్సిన సేఫ్టీ విధానాలు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటిస్తోంది. అయితే, ప్రజలు సాధారణ పద్ధతిలో చెబితే అర్థం చేసుకోరనే ఉద్దేశంతో.. పాపులర్ సినిమాలు, మీమ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది సదరు డిపార్ట్‌మెంట్ .

    మాస్క్ తీసేదేలే

    మాస్క్ తీసేదేలే

    ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల విడుదలైన అల్లు అర్జున్ చిత్రం 'పుష్ప'లోని ఓ పోస్టర్‌ను వాడేశారు. అందులో అల్లు అర్జున్ ఫొటోకు మాస్క్ పెట్టారు. ''డెల్టా అయినా.. ఒమిక్రాన్ అయినా.. నేను మాస్క్ తీసేదేలే'' అనే క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ ఫాన్స్ సహా తెలుగు వారు అందరూ దానిని తెగ షేర్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం దాన్ని మీరు కూడా చూసేయండి మరి.

    పుష్ప రెండో భాగం

    పుష్ప రెండో భాగం


    ఇక అల్లు అర్జున్ పుష్ప రెండో భాగం కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను కూడా మొదటి భాగాన్ని తెరకెక్కించిన టీమ్ అంతా కలిసి తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనీ సినిమా యూనిట్ అంతా ఎదురు చూస్తోంది. త్వరలో ఈ సినిమా షూట్ మొదలు కానుంది.

    English summary
    Ministry of Information and Broadcasting Department using allu arjun craze
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X