ధృవ సీక్వెల్ న్యూస్.. రాంచరణ్ చేస్తాడా!

తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం తాని ఒరువన్ విడుదలై నేటికి సరిగ్గా మూడేళ్లు. జయం రవి హీరోగా, అరవింద్ స్వామి విలన్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్నీ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించాడు. 3 వ వార్షికోత్సవ వేడుకల్లో మోహన్ రాజా ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించడం విశేషం.

పోలీస్ అధికారిగా జయం రవి నటన, విలన్ గా అరవింద్ స్వామి తిరుగులేని పెర్ఫామెన్స్ ఈ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణాలు. సీక్వెల్ లో జయం రవి హీరోగా నటించనున్నాడు. తొలి భాగంలో అరవింద్ స్వామి మరణిస్తాడు. దీనితో సీక్వెల్ లో ఎవరు విలన్ అనే ఉత్కంఠ నెలకొంది.

Mohan Raja announced Sequel for Thani Oruvan movie

ఇదిలా ఉండగా తెలుగులో ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ ధృవ పేరుతో రీమేక్ చేశాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్ర సీక్వెల్ గురించి అభిమానుల్లో చర్చ మొదలైంది. రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి సినిమాలో నటిస్తున్నాడు. ఆ తరువాత రాజమౌళి చిత్రం ఉంది. ఆ తరువాతే ధృవ సీక్వెల్ గురించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X