HBD Mohanlal: భారీగా పెరిగిన మోహన్‌లాల్ ఆస్తులు.. ఎన్ని వందల కోట్లంటే? ఏకైక మలయాళ హీరోగా రికార్డు

భారతదేశం గర్తించదగ్గ మహానటుల లిస్ట్ తీస్తే ఖచ్చితంగా ఉండే పేరు మోహన్‌లాల్. దాదాపు 5 దశాబ్ధాలుగా తన నటనతో ఆయన ప్రేక్షకులను అలరిస్తున్నారు. 60 ప్లస్‌లోనూ కుర్రాళ్లను మించి సినిమాలు తీస్తున్నారు. ఏడాదికి ఖచ్చితంగా మూడు, నాలుగు సినిమాలతో దుమ్మురేపుతున్నారు. నేడు మోహన్‌లాల్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా ది కంప్లీట్ మ్యాన్ జీవితం, సినిమాలు, రికార్డులు, ఇతర ఆసక్తికర వివరాలు పరిశీలిస్తే..

రెజ్లింగ్ ఛాంపియన్

1960 మే 21న కేరళలోని పథనంథిట్ట అనే గ్రామంలో జన్మించారు మోహన్‌లాల్. ఆయన పూర్తి పేరు మోహన్‌లాల్ విశ్వనాథన్. ఆయన తండ్రి విశ్వనాథన్ నాయర్ కేరళ ప్రభుత్వంలో లా సెక్రటరీ సహా కీలక హోదాల్లో పనిచేశారు. తిరువనంతపురంలోని మహాత్మాగాంధీ కాలేజీలో బీకాం చదివిన మోహన్‌లాల్‌లో రెజ్లర్ కూడా ఉన్నారు. 1977, 1978లలో కేరళ స్టేట్ రెజ్లింగ్ ఛాంపియన్‌గా అవతరించారు. దర్శకుడు ఉన్నికృష్ణన్ పిళ్లై తన కుటుంబానికి దగ్గరి బంధువు కావడంతో మోహన్‌లాల్ సినీరంగం వైపు అడుగులు వేశారు.

Mohanlal birthday special here s the Thudarum superstar s net worth and Assets Details

రికార్డుల రారాజు

1980లో మంజిల్ విరింజ పొక్కల్ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత పాదయోట్టం, ఆట్టకలశం, ఉయరంగలిల్, గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్, నడొడిక్కట్లు సినిమాలు మోహన్‌లాల్‌కు పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత చిత్రం, కిరీడం, చంద్రలేఖ, నరసింహం, దృశ్యం, పులిమురుగన్ వంటి ఎన్నో చిత్రాలతో మలయాళ సినిమాకు ఐకాన్‌గా మారారు. పులి మురుగన్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ నటుడిగా నిలిచారు. ఆ తర్వాత లూసిఫర్‌తో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరారు. ఏడాది ఎల్ 2: ఎంపురాన్‌తో రూ.300 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేసినా దురదృష్టవశాత్తూ రూ.268.08 కోట్ల వద్దే ఆగిపోయింది ఈ సినిమా. ఇక ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన తుడరంతో మరోసారి రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన మోహన్‌లాల్.. ఒక్క కేరళలోనే తొలిసారిగా రూ.100 కోట్ల మార్క్ దాటిన సినిమాగా తుడరంతో చరిత్ర సృష్టించారు.

పరభాషా చిత్రాల్లోనూ పైచేయి

మోహన్‌లాల్ ప్రతిభ ఒక్క కేరళకే పరిమితం కాలేదు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకులను కూడా ఆయన అలరించారు. ఇరువర్‌తో కోలీవుడ్‌లోకి.. ఆర్జీవీ దర్శకత్వంలో కంపెనీతో హిందీలో సత్తా చాటారు. కన్నడలో లవ్ సినిమాల్లో నటించిన మోహన్‌లాల్.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్‌తో తెలుగు వారిని పలకరించారు. తన తోటీ నటులు, తనకన్నా చిన్న నటులతో మల్టీస్టారర్స్ చేసిన అరుదైన నటుడు మోహన్‌లాల్. మమ్ముట్టి, దిలీప్, విజయ్, విశాల్, ఎన్టీఆర్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్‌తో నటించారు. నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావులు నటించిన గాండీవంలో ఓ సాంగ్‌లో స్టెప్పులేసి అలరించారు.

ఐదు సార్లు నేషనల్ అవార్డ్

47 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 400కు పైగా చిత్రాల్లో మోహన్‌లాల్ నటించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సేవలందించినందుకు గాను మోహన్‌లాల్‌కు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించగా.. భారత సైన్యం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ ఇచ్చింది. అలాగే ఐదుసార్లు జాతీయ చలన చిత్ర అవార్డులను మోహన్‌లాల్ కైవసం చేసుకున్నారు. 17 సార్లు కేరళ రాష్ట్ర అవార్డులు, 11 ఫిలింఫేర్ అవార్డులు ఆయన ఖాతాలో చేరాయి.

మోహన్‌లాల్ ఆస్తుల వివరాలు

సినిమాలు, చిత్ర నిర్మాణంతో పాటు పలు వ్యాపారాలలోనూ మోహన్‌లాల్ పెట్టుబడులు పెట్టారు. కొచ్చిలోని ఓ హాస్పిటల్‌తో పాటు రెస్టారెంట్ చైన్‌, సినిమా థియేటర్ ఆయనకు ఉన్నాయి. అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ పాంథమ్‌తో పాటు మెర్సిడేస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, పోర్సే కెయన్నే, బీఎండబ్ల్యూ ఎక్స్ 5, బీస్ట్ వంటి లగ్జరీ కార్లు ఆయన గ్యారేజీలో ఉన్నాయి. కొచ్చిలో దాదాపు 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా మోహన్ లాల్ సొంతం. సినిమాకు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే మోహన్‌లాల్ ఆస్తులు రూ.430 కోట్ల పైమాటేనని మాలీవుడ్ టాక్. ఆయన కెరీర్‌లో ఎన్నో విజయాలు సాధించి, మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.

More from Filmibeat

Read more about: mohanlal Thudarum movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X