ఆ సూపర్‌స్టార్ ఇంట్లో ఉండొచ్చు.. ఒక్క రాత్రికి ఎంతంటే? బుకింగ్ ఎలా?
భారతదేశంలో సినీతారలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. అభిమానులకు వాళ్లు దేవుళ్లతో సమానం. వారిని ఒక్కసారి చూస్తే చాలు.. జీవితం ధన్యం అనుకునేవారు కోట్లలో ఉన్నారు. చెన్నై, హైదరాబాద్, ముంబై ఇలా స్టార్స్ నివసించే నగరాలలో వారి ఇళ్ల చుట్టూ ఫ్యాన్స్ ప్రదక్షణలు చేస్తుంటారు. అలాంటిది అభిమాన హీరోలు నివసించే ఇంట్లో బస చేసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. ఇలాంటి సదుపాయాన్ని కొందరు హీరోలు తమ అభిమానులకు కల్పించారు. ఈ లిస్ట్‌లోకి మరో సూపర్‌స్టార్ చేరారు ఈ వివరాల్లోకి వెళితే..
తన ఇంటిని అభిమానులకు తెరిచిన షారుఖ్
ప్రజలు, అభిమానులు తమ ఇళ్లలో బస చేసేందుకు వీలుగా కొందరు స్టార్స్ వెసులుబాటు కల్పించారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ముంబైలోని అత్యంత ఖరీదైన నివాసాల్లో ఒకటైన మన్నత్‌లో నివసిస్తారు. అయితే భారత్‌తో పాటు విదేశాల్లోనూ షారుఖ్‌కు వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్ మాన్షన్ కూడా ఒకటి. విశాలమైన ఈ ప్రాంగణంలో ఆరు బెడ్‌రూంలు, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ విలాసవంతమైన భవనంలో ఎవరైనా ఉండేందుకు షారుఖ్ అవకాశం కల్పించారు. ఇందులో ఒక్కరోజు బస చేయాలంటే అక్షరాల రూ.2 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌గా మమ్ముట్టి ఇల్లు
ఇక మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఇలాగే తన ఇంటిని సామాన్యులకు అందుబాటులో ఉంచారు. మమ్ముట్టికి కేరళలోని కొచ్చిలో పనంపిల్లి నగర్ ఏరియాలోని జోసెఫ్ రోడ్‌లో ఓ ఇల్లు ఉంది. దానిని అభిమానుల కోసం టూరిస్ట్ ప్లేస్‌గా మార్చాలని మమ్ముట్టి నిర్ణయించారు. మమ్ముట్టిని కలిసేందుకు ఎక్కువ మంది అభిమానులు ఆ ఇంటికే వెళ్తారు. వారి కోసం దానిని అందుబాటులో ఉంచి.. అక్కడ బస చేసేందుకు మమ్ముట్టి ఏర్పాట్లు చేయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి మమ్ముట్టి నివాసంలో స్టే చేసేందుకు బుకింగ్స్ ఓపెన్ చేశారు. నాలుగు బెడ్‌రూంలు ఉన్న ఈ విల్లాలో ఒకరోజు రాత్రి ఉండాలంటే దాదాపు రూ.75 వేలు ఖర్చు చేయాల్సిందే.
దుబాయ్‌లో ఇల్లు కొన్న మోహన్‌లాల్
షారుఖ్, మమ్ముట్టి బాటలోనే నడుస్తున్నారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. నాలుగు దశాబ్ధాలుగా మాలీవుడ్‌కు ఐకాన్‌గా నిలిచిన ఆ అగ్రనటుడు ఇటీవలే తన 65వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ వయసులోనూ కుర్రాళ్లతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఎల్ 2: ఎంపురాన్, తుడరం సినిమాలతో బాక్సాఫీస్ బెండ్ తీసిన మోహన్‌లాల్.. మరిన్ని సినిమాలను విడుదల చేసే పనిలో ఉన్నారు. దేశ, విదేశాల్లో ఆయనకు కోట్లాది విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇటీవలే దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా టవర్స్‌లో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా నిలిచారు.
అభిమానులకు అందుబాటులో మోహన్‌లాల్ ఇల్లు
మోహన్‌లాల్ ఆస్తుల్లో.. తమిళనాడులోని ఊటీలో ఆయనకు ఓ విల్లా ఉంది. తీరిక దొరికినప్పుడల్లా కుటుంబంతో కలిసి అక్కడ గడుపుతారు. అయితే చాలా వరకు ఆ విల్లా ఖాళీగా ఉండటంతో దానిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని మోహన్‌లాల్ నిర్ణయించారు. అవసరమైన మార్పులు చేసి దానిని ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌గా మార్చేశారు. ఇక్కడ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అరుదైన కళాఖండాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఒక్క రాత్రి బస చేయాలంటే దాదాపు 37 వేల రూపాయలు షేర్ చేస్తున్నారు. దీనికి పన్నులు ఎక్స్‌ట్రా. ఊటికి వచ్చే పర్యాటకులకు మోహన్‌లాల్ నివాసం టూరిస్ట్ ప్లేస్‌గా నిలిచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











