'70 లక్షలు నొక్కేసి.. హీరోయిన్ తో సహజీవనం'
ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఒక షాకింగ్ కాంట్రవర్సీ బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అప్పటికే పెద్దగా ఆఫర్స్ లేక చిన్న చిన్న అవకాశాలు చేస్తూ వస్తున్నా యువ హీరో రాజ్ తరుణ్ తనని కాదంటున్నారు అని లావణ్య అనే యువతి పోలీసులని ఆశ్రయించడం ఒక్కసారిగా అందరిలో సెన్సేషన్ గా మారింది. దీనితో ఇప్పుడు దాదాపు వార్తల్లో అంతా వీరి కాంట్రవర్సీ తోనే నిండిపోయి ఉండగా ఇప్పుడు వీరి కాంట్రవర్సీ రోజుకో కొత్త టర్న్ లోకి వెళుతుంది.
తవ్వే కొద్దీ ఇంకా దొరుకుతున్నాయి అన్నట్టుగా రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య నోరు విప్పుతుడడంతో అంతకంతకు చాలా షాకింగ్ విషయాలు రాజ్ తరుణ్ విషయంలో బయటకి వస్తున్నాయి. ఆమె రాజ్ తరుణ్ తో ఎప్పటి నుంచో రిలేషన్ షిప్ లో ఉందని కాగా తాము ఒక గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం కానీ నాకు ఇలాంటి ఒక రోజు వస్తుంది అని తెలియక అప్పుడు రిజిస్టర్ చేసుకోలేదని అందుకే ఇప్పుడు ఇంత బాధ పడాల్సి వస్తుంది అని ఆమె తెలిపింది.

అలాగే నేను ఫారిన్ వెళ్ళినప్పుడు నుంచి రాజ్ తరుణ్ తో దూరం ఎక్కువ అయ్యింది అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ సమయంలో మాల్వి శర్మ అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ కి పరిచయం ఏర్పడడం అక్కడ నుంచి ఇద్దరు రిలేషన్ షిప్ స్టార్ట్ చేసారని తెలిపింది. అంతే కాకుండా రాజ్ తరుణ్ ఆమె దగ్గర నుంచి ఇప్పుడు వరకు పెద్ద మొత్తంలో 70 లక్షల వరకు డబ్బులు తీసుకున్నాడని ఆమె తరపు న్యాయవాది మరిన్ని షాకింగ్ విషయాలు రివీల్ చేశారు.
అలాగే లావణ్య, రాజ్ తరుణ్ ల బంధం కోసం ఎప్పటి నుంచో టాలీవుడ్ లో చాలా మంది నటీనటులకు తెలుసు అని కానీ నేను వారితో పెద్దగా పరిచయాలు ఏర్పర్చుకోలేదని లావణ్య తెలిపింది. లేకుంటే తనకోసం మాట్లాడ్డానికి కొందరైనా తప్పకుండా వచ్చేవారని ఎమోషనల్ అయ్యింది. అంతే కాకుండా మాల్వి శర్మని రాజ్ తరుణ్ ని దయచేసి వదిలేయమని ఎన్నో సార్లు ప్రాధేయపడినప్పటికీ ఆమె తనని బెదిరించేది అని నీకు ఇష్టమొచ్చింది చేస్కో నిన్నేం చెయ్యాలో తెలుసు అన్నట్టుగా బెదిరించేది అని లావణ్య తెలిపింది.

అందుకే తనకి ఇష్టం లేకపోయినా ఇలా ఉంటే న్యాయం జరిగే పరిస్థితి లేదని పోలీసులని ఆశ్రయించాను తప్పితే రాజ్ తరుణ్ ని ఇబ్బందులు పెట్టాలని కాదని తెలిపింది. తాను అసలు ఏ డ్రగ్స్ డీల్స్ చెయ్యలేదని నాపై అనవసంగా అబాండాలు వేస్తున్నారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇన్ని చేసినా కూడా తనకి రాజ్ తరుణ్ మాత్రమే కావాలని అతన్ని వదులుకోవడం ఇష్టం లేదు నేను అతని ఒక్కడినే ఊహించుకున్నాను అతనితోనే జీవితం అనుకున్నాను నన్ను ఇబ్బందులు పెట్టినప్పటికీ నాకు రాజ్ తరుణ్ అంటేనే ఇష్టం అతనే కావాలి అని ఇప్పటికీ ఆమె అదే మాట మీద కూర్చుంది. దీనితో ఈ షాకింగ్ కొత్త విషయాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











