twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Most Eligible bachelor: ఫైనల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అఖిల్.. పోస్టర్ తోనే అదరగొట్టేసాడు

    |

    అక్కినేని యువ హీరోల్లో ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా అఖిల్ అక్కినేని మొదటి విజయం అయితే ఇంకా దక్కలేదు. వరుసగా మూడు సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో అయితే విజయాన్ని అందుకోవడం లేదు అని కాస్త భిన్నంగా ట్రై చేయాలని అనుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం అతను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని సక్సెస్ ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

    గత ఏడాది నుంచి విడుదలను వాయిదా వేసుకుంటూ వస్తున్న చిత్ర యూనిట్ మొత్తానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకుంది. అసలేతే గత ఏడాదిలోనే రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్డౌన్ పరిస్థితుల కారణంగా రెండు మూడు నెలలకు ఒకసారి వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సారి ఎలాగైనా అనుకున్న తేదీకి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు అక్టోబర్ 8న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఒక ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక పోస్టర్లో అఖిల్ అక్కినేని ఏడు రకాల డ్రెస్సుల్లో సరికొత్తగా దర్శనమిచ్చాడు. చూస్తుంటే నటనతో కూడా సరికొత్తగా ఆకట్టుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.

    Most Eligible Bachelor movie latest release date

    అఖిల్ అక్కినేని ఎక్కువగా రెగ్యులర్ ఫార్మాట్ లోనే సినిమాలు చేస్తున్నాడు అనే కామెంట్స్ గతంలో చాలా వచ్చాయి. అయితే అలాంటి కామెంట్స్ కూడా ఈ సినిమాతో మళ్లీ రావని అంటున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ చాలాకాలం తర్వాత డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రస్తుతానికైతే పెద్దగా అంచనాలు లేవు. విడుదలైన సాంగ్స్ కూడా అనుకున్నంతగా అయితే బజ్ క్రియేట్ చేయలేదు. ఇక దర్శకుడు భాస్కర్ కూడా హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. పరుగు సినిమా తర్వాత ఆ దర్శకుడు మళ్లీ మరో విజయాన్ని అందుకోలేదు. ఆరెంజ్, ఒంగోలు గిత్త వంటి విభిన్నమైన సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద భారీ పరాజయాన్ని మూట కట్టుకున్నాయి. అందుకే అతని ఆశలు అన్నీ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పైనే ఉన్నాయి.

    ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని బొమ్మరిల్లు భాస్కర్ చాలా బలంగా కోరుకుంటున్నాడు. అఖిల్ అక్కినేని కూడా ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా ముఖ్యం అని చెప్పాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. కానీ ఏజెంట్ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయించారు కాబట్టి ఆబాక్సాఫీస్ ఫలితం కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. మరి అఖిల్ అక్కినేని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. అలాగే మరో కొత్త ప్రాజెక్ట్ పై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వాలని అఖిల్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    English summary
    Most Eligible Bachelor movie latest release date
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X