Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అఖిల్ బర్త్ డే స్పెషల్.. ‘బ్యాచ్‌లర్’ పోస్టర్ వైరల్
అక్కినేని అఖిల్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్బంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వస్తున్నాయి. పుట్టిన రోజు స్పెషల్ అంటూ కొన్ని వెరైటీ పోస్టర్లను వదలుతున్నారు. అంతే కాకుండా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రాబోతోంది. ఇప్పటికీ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సారి హిట్ పడేలానే ఉంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలు ఎన్నో అంచనాల నడుమ విడుదలయ్యాయి. కానీ అవి ఆశించినంతగా వర్కవుట్ అవ్వలేదు.
ఇప్పుడు అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ రాబోతోన్నాడు. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అన్నీ కూడా బాగానే క్లిక్ అయ్యాయి. అలా బ్యాచ్‌లర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా ప్రమోట్ చేస్తున్నారు. ఇక రేపటి బర్త్ డే సందర్బంగా అఖిల్ కోసం సర్ ప్రైజ్‌లు రెడీ చేశారు. రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ రాబోతోంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే తాజాగా బ్యాచ్ లర్ టీం నుంచి ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇందులో అఖిల్ మరింత స్టైలీష్‌గా ఉన్నాడు. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ నవ్వుతూనే అమ్మాయిలను పడేసేవాడిలా ఉన్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు ఈ ఇద్దరి కెమిస్ట్రినే హైలెట్ కానుంది.