Siddu Jonnalagadda: ఆ హీరోయిన్ ప్రేమలో మునిగిపోయిన సిద్దు జోన్నలగడ్డ.. త్వరలోనే పెళ్లి!
టాలీవుడ్ లో వరుసగా పెళ్లి వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య పెళ్లికి అంతా సిద్ధం అయిపోయింది. మరోవైపు వెంకటేష్ కూతురి నిశ్చితార్థం, కీరవాణి కొడుకు పెళ్లి.. వరుసగా శుభకార్యలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో పెళ్లి వార్త బయటకు వచ్చింది. అది ఎవరో కాదు.. టాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ఆయన ఓ హీరోయిన్ ప్రేమలో పీకల్లోతూలో మునిగిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వీరి పెళ్లి ఎప్పుడు.. ఎవరు ఆ హీరోయిన్ అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుుకుందాం.
టాలీవుడ్ లో సెలబ్రిటీస్ అంతా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో శర్వానంద్ వంటి కుర్రహీరోలు పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు అదే బాటలో చాలా మంది కుర్ర హీరోలు నడుస్తున్నారు. అందులో మొదటగా వరుణ్, లావణ్యల పెళ్లి ఎప్పటి నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరి పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయిపోతున్నాయి. ఇటలీలో కుటుంబ సభ్యుల మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోనున్నారు ఈ జంట.

ఇప్పటికే మెగా కుటుంబం, అల్లు కుటుంబం ఇటలీ బయలుదేరింది. మరోవైపు వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం కూడా ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖుల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. ఇక కీరవాణి రెండో కొడుకు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అది కూడా మురళి మోహన్ మనవరాలితో త్వరలో పెళ్లి ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. దిల్ రాజు అన్నకొడుకు ఆశిష్ కూడా త్వరలో పెళ్లి చేసుకోన్నారట.
ఇప్పుడు మరో హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. డీజే టిల్లు సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న సిద్దూ జొన్నలగడ్డ. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన సిద్దు జొన్నలగడ్డ... త్వరలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నారట. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. కిల్లింగ్ లుక్స్ తో అమ్మాయిల మనసు దోచే ఈ కుర్ర హీరో... ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్ ప్రేమలో పడిపోయారట.

ఆ హీరోయిన్ ప్రేమలో మునిగిపోయిన సిద్దూ.. త్వరలోనే ఆమెతో ఏడు అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె పవన్ కల్యాణ్ సినిమాలో కూడా నటించందని తెలుస్తోంది. ఇక ఆ బ్యూటీ ప్రేమలో పడిన సిద్దూ... లవ్ ప్రపొజల్ పెట్టారట. ఇక ఆమె ఆలోచించి.. సిద్దు ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబ సభ్యులకు వీరి ప్రేమను చెప్పి... ఇంట్లో వాళ్లను ఒప్పించారని సమాచారం.

ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. ప్రస్తుతం సిద్దు డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్వేర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనుమప పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











