Top 10 Heros: దేశం మెచ్చిన టాప్ 10 హీరోలు వీళ్లే.. టూలో ప్రభాస్, మరి వన్‌లో ఎవరున్నారంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ గురించి అందిరకీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలపై ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా మార్చి 2024కి సంబంధించి ఇండియా టాప్ 10 హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 హీరోల పేర్లను ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే టాప్ వన్ స్థానంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉండగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే దేశాన్ని ఏలేస్తున్న టాప్ 10 హీరోల లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్మాక్స్ మీడియా సంస్థ విడుదల చేసిన ఇండియా టాప్ 10 హీరోల లిస్టులో టాప్ వన్ ప్లేస్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నిలిచారు. గతేడాది జవాన్, పఠాన్, డంకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెక్ అయ్యాడు. ఇక టాప్ 2లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిలిచాడు. సలార్ సినిమాతో బాక్సాఫీసును షేర్ చేసిన ఈయన చాలా కాలంగా టాప్ 1 పొజిషన్ లోనే కొనసాగుతున్నారు. ఇక టాప్ 3లో విజయ్ దళపతి నిలిచాడు. అదిరిపోయే సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్న ఈయనకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.

Most Popular Indian Top 10 Heros List of March 2024 List is Here

ఇక టాప్ 4లో సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన రౌజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు నమోదు అయ్యాయి. ఇక టాప్ 5లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతేడాది ఏ ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కానీ ఈయన హీరోగా చేస్తున్న పుష్ప 2కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ ఏడాది మధ్యలో థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాను అంతా చూడాలనుకుంటున్నారు. అలాగే ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. అలా ఈయన టాప్ లో నిలించారు.

ఇక టాప్ 6లో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఈయన కూడా గతేడాది ఎలాంటి సినిమాలు చేయకపోయినా ప్రస్తుతం ఆయన చేస్తున్న దేవర సినిమాతో ఆయన ట్రెండింగ్ లోకి వచ్చాడు. ఇక టాప్ 7లో హృతిక్ రోషన్ నిలిచారు. ఇటీవలే ఫైటర్ సినిమాతో వచ్చి అందిరినీ మెస్మరైజ్ చేశాడీ హీరో. ఇక టాప్ 8లో అక్షయ్ కుమార్ నిలిచారు. చివరగా ఆయన రామ్ సేతు, 2.0 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Most Popular Indian Top 10 Heros List of March 2024 List is Here

అలాగే తొమ్మిదో స్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిలిచారు. ఆర్ఆర్ఆర్ తర్వాత నుంచి ఈయనకు సంబంధించిన ఒక్క సినిమా కూడా ఇప్పటికీ విడుదల కాలేదు. అయితే శంకర్ డైరెక్షన్ లో ఈయన హీరోగా గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇక చివరి స్థానంలో అంటే టాప్ 10లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఈయన గతేడాది టైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వసూళ్లు చేయలేకపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X