Most Popular Male stars: ఈసారి నెంబర్ వన్ స్థానంలో ఎన్టీఆర్.. తగ్గిన బన్నీ హవా.. పోటీగా నాని!

ఇటీవల కాలంలో స్టార్ హీరోల కు సంబంధించిన క్రేజ్ అనేది సోషల్ మీడియా ప్రపంచంలో చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. అభిమానులు వారి స్టార్ హీరో హోదాను మరింత పెంచే విధంగా కొన్నిసార్లు ట్యాగ్స్ కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. ఇక మోస్ట్ పాపులర్ స్టార్స్ సర్వేలకు కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇక ఓరామాక్స్ సర్వే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతినెల డిజిటల్ మీడియా అలాగే సోషల్ మీడియా సర్వేలో ఎక్కువగా వైరల్ అయిన స్టార్స్ కు ప్రత్యేకంగా ఇస్తున్న ర్యాంక్స్ అభిమానులు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇక 2022 జూలై నెలలో ఏ స్టార్ హీరో ఏ ర్యాంకును దక్కించుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

రవితేజ 10, చిరంజీవి 9

రవితేజ 10, చిరంజీవి 9

మాస్ మహారాజ రవితేజ ఈసారి రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా ద్వారా కొంత ఇంటర్నెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా డిజాస్టర్ అయినప్పటికీ కూడా విడుదలకు ముందు మాత్రం మంచి బజ్ క్రియేట్ చేశాడు. దీంతో అతను 10వ ర్యాంకు అందుకోగా మెగాస్టార్ చిరంజీవి వరుస అప్డేట్స్ ద్వారా గత నెలలో మంచి క్రేజ్ అయితే అందుకున్నాడు. ముఖ్యంగా లూసిఫర్ సినిమాకు సంబంధించిన లుక్ అయితే ఒక దాదాపు ఒక నెల రోజులపాటు వైరల్ అయింది. ఇక ఆయన ఈ సర్వేలో 9వ స్థానంలో నిలిచారు.

 విజయ్ దేవరకొండ 8, పవన్ కళ్యాణ్ 7

విజయ్ దేవరకొండ 8, పవన్ కళ్యాణ్ 7

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు రాజకీయాలతో కూడా చాలా బిజీగా మారిపోయారు. ఇక ఆయన ఈసారి సర్వేలో 7వ స్థానంలో కొనసాగారు. మరోవైపు విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి అందుకుంటున్నాడు. తప్పకుండా ఆ సినిమాతో భారీ స్థాయిలోనే సక్సెస్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓరామాక్స్ సర్వేలో విజయ్ దేవరకొండ 8వ స్థానంలో నిలిచాడు.

 నాని 6, మహేష్ బాబు 5

నాని 6, మహేష్ బాబు 5

నేచురల్ స్టార్ నాని కూడా ఇటీవల కాలంలో మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. బాక్సాఫీస్ వద్ద అంటే సుందరానికి సినిమా ఉన్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత దసరా అప్డేట్స్ ద్వారా మంచి క్రేజ్ అయితే తెచ్చుకున్నాడు. ఇక ఈ సర్వేలో నాని 6వ స్థానంలో నిలువుగా 5వ స్థానంలో మహేష్ బాబు పేరు బాగా ట్రెండ్ అయింది. మహేష్ త్రివిక్రమ్ రాజమౌళి ప్రాజెక్టులకు సంబంధించి అనేక రకాల వార్తలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు.

 రామ్ చరణ్ 4, అల్లు అర్జున్ 3

రామ్ చరణ్ 4, అల్లు అర్జున్ 3

ఇక RRR సినిమా ద్వారా మంచి క్రేజ్ అందుకున్న రామ్ చరణ్ తేజ్ ఆ తర్వాత ఆచార్య సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అనుకున్నప్పటికి అతని క్రేజ్ అయితే కొంచెం కూడా తగ్గలేదు. రామ్ చరణ్ 15వ సినిమాకు సంబంధించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ సర్వేలో రాంచరణ్ తేజ్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక అంతకంటే ముందు మూడో స్థానంలో అల్లు అర్జున్ నిలిచాడు. పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన అప్డేట్స్ తోనే అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే గతంలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉండగా ఈసారి ర్యాంక్ కాస్త తగ్గింది.

 ఎన్టీఆర్ 1, ప్రభాస్ 2

ఎన్టీఆర్ 1, ప్రభాస్ 2

ఇక రెండవ స్థానంలో అయితే రెబల్ స్టార్ ప్రభాస్ కొనసాగుతున్నాడు. వరుసగా ఫ్యాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టడం ద్వారా ఏదో ఒక విషయం ద్వారా ప్రభాస్ పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఇక మొదటి స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలవడం విశేషం. ఎన్టీఆర్ RRR సినిమా ద్వారా విదేశీయులకు కూడా ఒక ఫేవరెట్ హీరోగా మారిపోతున్నాడు. ఇక ఆస్కార్ భరిలో కూడా అతను నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సర్వేలలో ఎన్టీఆర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X