top 10 Heros: టాలీవుడ్ టాప్ 10 టైర్ 2 హీరోలు వీళ్లే.. వన్‌లో విజయ్ దేవరకొండ, టూలో ఎవరంటే?

ప్రముఖ మీడియా సంస్థ ఫిల్మీబౌల్ గురించి అందిరకీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ తారలపై, సినిమాలకు సంబంధించిన విషయాల గురించి చెబుతూనే అప్పుడప్పుడు సర్వేలు కూడా చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ సంస్థ టాలీవుడ్ కు చెందిన టాప్ 10 టైర్ 2 హీరోల లిస్టును విడుదల చేసింది. అందులో టాప్ 10 టైర్ 2 హీరోల పేర్లను ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే టాప్ వన్ స్థానంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఉండగా.. నాచురల్ స్టార్ నాని రెండో స్థానంలో నిలిచాడు. మరి మిగతా స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిల్మీబౌల్ టాప్ 10 టైర్ 2 హీరోల్లో.. మొదటి స్థానంలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక టాప్ 2లో నాచురల్ స్టార్ నాని నిలిచాడు. ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన ఈయన.. సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టు కొట్టనుందనేది.

Most Popular Tollywood top 10 Tier 2 Heros List of April 2024 List is Here

ఇక టాప్ 3లో రామ్ పోతినేని నిలిచాడు. ఇటీవలే స్కంధ సినిమాలో వచ్చి డిజౌస్టర్ సొంతం చేసుకున్న ఈయన ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ కొట్టబోతుందో చూడాలి మరి. ఇక టాప్ 4లో నాగ చైతన్య హీరోగా చేస్తున్నాడు. ఇటీవలే దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఈయన తండేల్ సినిమాలో నటిస్తున్నారు. సాయిపల్లవితో కలిసి చేస్తున్న ఈ సినిమాపై పెద్ద ఎత్తునే అంచనాలు నమోదు అయ్యాయి.

ఇక టాప్ 5లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నిలిచాడు. గతేడాది విరూపాక్ష సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈయన ముందు ముందు ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి. ఇక టాప్ 6లో హీరో నిఖిల్ సిద్దార్థ్ నిలిచాడు. గతేడాది కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన సూపర్ సక్సెస్ సాధించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన స్పై సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. మరి ముందు ముందు ఏ సినిమాతో వస్తారో చూడాలి.

ఇక ఏడవ స్థానంలో నవీన్ పొలిశెట్టి నిలిచాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈయన ట్రెండింగ్ లో నిలిచి టాప్ 7 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక టాప్ 8లో అడివి శేష్ నిలిచాడు. గతేడాది ఎలాంటి సినిమాలు చేయకపోయినా ఈయన ట్రెండింగ్ లోనే కొనసాగుతున్నాడు. ఇక టాప్ 9లో శర్వానంద్ నిలిచాడు. అలాగే టాప్ 10లో వరుణ్ తేజ్ నిలిచాడు. ఇటీవలే ఆపరేషన్ వాలెంటైన్ తో వచ్చి అందరినీ నిరాశపరిచాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X