ఇండస్ట్రీని షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు.. అల్లు అర్జున్, ప్రభాస్ ఏ స్థానంలో ఉన్నారంటే?

Tollywood stars: 2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, టాలీవుడ్ స్టార్స్‌కు సంబంధించిన ఆసక్తికర నివేదికను గూగుల్ విడుదల చేసింది. హిట్‌లు, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా అభిమానులు తమ అభిమాన హీరోలపై చూపించే ప్రేమ ఈ ఏడాదిలోనూ స్పష్టంగా కనిపించింది. థియేటర్లలో సినిమాలు చూసే ఉత్సాహంతో పాటు, ఆన్‌లైన్‌లోనూ హీరోల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో గూగుల్ సెర్చ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ (Google searches 2025)చేయబడిన టాలీవుడ్ సెలబ్రిటీల జాబితా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఏడాది గూగుల్ సెర్చ్ డేటా ప్రకారం టాలీవుడ్ లో మోస్ట్ సెర్చ్ హీరోలు జాబితా వెల్లడించింది. ఇది టాలీవుడ్ సినిమా స్థాయి ప్రస్తుతం నేషనల్ మాత్రమే కాకుండా గ్లోబల్ స్థాయికి చేరిందని స్పష్టంగా చూపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రిలీజ్‌లు, స్టార్ ఇమేజ్, సోషల్ మీడియా బజ్, మాసివ్ ఫ్యాన్ బేస్ వంటి అంశాలు ఈ సెర్చ్ లిస్ట్‌పై కీలక ప్రభావం చూపినట్లు గూగుల్ నివేదిక వెల్లడించింది.

Most Searched Tollywood Stars on Google 2025 Allu Arjun Prabhas Mahesh Babu Pawan Kalyan Jr NTR

ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 2024 చివర్లో విడుదలైన 'పుష్ప 2' సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా సంచలన వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన ఈ మూవీ కారణంగా ఏడాది పొడవునా అల్లు అర్జున్ పేరు గూగుల్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. టీజర్, ట్రైలర్ రిలీజ్‌ల సమయంలో సెర్చ్ వాల్యూమ్ ఒక్కసారిగా పెరగడం గమనార్హం.

'పుష్ప 2' విజయం మాత్రమే కాకుండా, ఆ సినిమా చుట్టూ ఏర్పడిన వివాదాలు కూడా అల్లు అర్జున్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిపాయి. ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురికావడం వంటి ఘటనలు సంచలనంగా మారాయి. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించడం, అల్లు అర్జున్‌పై కేసు నమోదు కావడం, తదనంతర పరిణామాల్లో ఆయన ఒక రోజు జైలు జీవితం అనుభవించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలన్నీ కూడా గూగుల్ సెర్చ్‌లను మరింత పెంచిన అంశాలుగా నిలిచాయి.

ఇదే సమయంలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం ఆయన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అవార్డు అనంతరం ఆయన పేరు దేశవ్యాప్తంగా మరింతగా మార్మోగింది. అంతేకాదు, 'పుష్ప 2' తర్వాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో కలిసి అల్లు అర్జున్ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టడం సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపింది. అట్లీ-బన్నీ కాంబినేషన్‌పై ఏర్పడిన అంచనాలు సోషల్ మీడియాలో, గూగుల్ సెర్చ్‌ల్లో స్పష్టంగా కనిపించాయి. దీనితో పాటు దాదాపు ఐదేళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నాడన్న ప్రచారం కూడా అల్లు అర్జున్‌ను 2025లో మోస్ట్ సెర్చ్‌డ్ టాలీవుడ్ సెలబ్రిటీగా నిలబెట్టింది.

ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. 'సలార్', 'కల్కి' సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. 2025లో ఆయనకు సంబంధించిన 'ది రాజా సాబ్', 'స్పిరిట్', 'కన్నప్ప', 'ఫౌజీ' వంటి ప్రాజెక్టులు వరుసగా వార్తల్లో నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాల అప్‌డేట్స్, లుక్స్, రిలీజ్ డేట్స్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లిస్ట్‌లో మూడో స్థానాన్ని నిలిచారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో కలిసి నటిస్తున్న తొలి పాన్ వరల్డ్ మూవీ కారణంగా ఆయన పేరు ఈ ఏడాది అంతా వార్తల్లో నిలిచింది. ఈ సినిమా వారణాసి నేపథ్యంతో తెరకెక్కుతుండటం, ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందడం, అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరగడం, హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ దృష్టిని ఆకర్షించడం వంటి అంశాలు మహేష్ బాబు క్రేజ్‌ను గణనీయంగా పెంచాయి.

ఇక పవన్ కళ్యాణ్ కూడా 'ఓజీ' సినిమా కారణంగా గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ అయిన హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నారు. నాలుగో స్థానంలో నిలిచారు. పవన్ కళ్యాణ్ సినిమా అప్‌డేట్స్‌తో పాటు ఆయన రాజకీయ ప్రస్థానం కూడా సెర్చ్‌లకు కారణమైంది. ఇక ఐదో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇచ్చిన గ్లోబల్ ఇమేజ్ కారణంగా వీరిద్దరికీ విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఈ ఇద్దరి గురించి తెలుసుకోవడానికి గూగుల్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ 'వార్ 2' ప్రాజెక్ట్ కారణంగా 2025లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన హీరోగా నిలిచాడు.

మొత్తానికి 2025 సంవత్సరం గూగుల్ సెర్చ్ డేటా టాలీవుడ్ ప్రభావాన్ని స్పష్టంగా చాటింది. హిట్ సినిమాలు, పాన్ ఇండియా ఇమేజ్, సోషల్ మీడియా బజ్ అన్ని కలిసి టాలీవుడ్ స్టార్స్‌ను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాయి. వచ్చే సంవత్సరంలో మన హీరోలు మరెన్ని రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

More from Filmibeat

Read more about: allu arjun pawan kalyan prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X