ఫ్యాన్సీ రేటుకు అఖిల్ మిస్టర్ మజ్ను శాటిలైట్ హక్కులు!

అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ లవర్ బాయ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. అఖిల్ సరసన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర టీజర్ కూడా ఆకట్టుకుంది. హిట్ దర్శకుడు, కొత్తగా అఖిల్ పాత్ర ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

మిస్టర్ మజ్ను శాటిలైట్ హక్కుల గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర శాటిలైట్ హక్కులని ఓ ప్రముఖ సంస్థ 5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలిప్రేమ చిత్రాన్ని నిర్మించిన బివిఎస్ఎన్ ప్రసాదే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం హైలైట్ గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తొలి ప్రేమ చిత్రానికి అదిరిపోయే సాంగ్స్ అందించాడు. మళ్ళి అదే కాంబినేషన్ కావడంతో ఆసక్తి నెలకొంది.

Mr Majnu satellite rights sold for fancy price

ఇక అఖిల్ ఈ చిత్రపై పూర్తి జాగ్రత్త వహిస్తున్నాడు. తొలి రెండు చిత్రాలు నిరాశ పరచడంతో మిస్టర్ మజ్నులో తన నటన, లుక్స్ పై అఖిల్ కేర్ తీసుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి చివరి వారంలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X