కృష్ణ ఫ్యాన్స్ కొట్టడానికి వచ్చారు.. ఎంత చెప్పినా వినలేదు.. పాత విషయాన్ని బయటపెట్టిన మురళి మోహన్

తెలుగు సినీ పరిశ్రమలో మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చిన ఆయన నటుడిగా, హీరోగా తర్వాత నిర్మాతగా అనేక సంచలన విజయాలు తన పేరిట నమోదు చేసుకున్నాడు. రాజకీయాలలో కూడా ప్రవేశించి పలు సార్లు ఎంపీగా పని చేసిన ఆయన ప్రస్తుతం అన్నిటికీ దూరమై ప్రశాంత జీవితం గడుపుతున్నారు. తాజాగా ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.

సినీ పరిశ్రమలో ఎంట్రీ

సినీ పరిశ్రమలో ఎంట్రీ

జగమే మాయ అనే సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన మురళీమోహన్ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన తిరుపతి అనే సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అలా మొదలైన ఆయన నటనా ప్రస్థానం దాదాపు 350 సినిమాల్లో నటించేలా చేసింది. హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన జయభేరి ఆర్ట్స్ అనే ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించి అనేక విజయవంతమైన చిత్రాలను కూడా తన బ్యానర్ లో నిర్మించారు. ఇక ఒక పక్క సినీ నిర్మాణం చేస్తూనే మరో పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రెండు చేతులా సంపాదించారు.

ఆసక్తికర విషయాలు

ఆసక్తికర విషయాలు

ఇక తర్వాత రాజకీయాలలో ప్రవేశించిన ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పలు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన హీరో కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకానొక సమయంలో కృష్ణ ఫ్యాన్స్ ఆయనను కొట్టడానికి కూడా వచ్చారని ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

ఇంటర్ క్లాస్ మేట్స్

ఇంటర్ క్లాస్ మేట్స్

మురళీ మోహన్ మాట్లాడుతూ "కృష్ణ గారు, నేను ఇంటర్ లో క్లాస్ మేట్స్.. కాలేజ్ మొత్తం కి కృష్ణ గారే అందగాడు.. అందరు ఆయన చుట్టూనే తిరిగేవారు.. కాలేజ్ తరువాత తేనే మనసులు సినిమాతో ఆయన హీరోగా మారడం ఆ తర్వాత సూపర్ స్టార్ గా ఎదగడం అందరికి తెలిసిందేనని చెప్పుకొచ్చారు. నేను నటన వైపు నుంచి నిర్మాతగా మారాక.. కృష్ణ, నాగార్జున కాంబోలో వారసుడు చిత్రాన్ని నిర్మించాననీ ఆ సినిమాలో నాగార్జున, తండ్రి కృష్ణను నిలదీసే సీన్ ఒకటి ఉంటుందని చెప్పుకొచ్చారు.

కొట్టడానికి కూడా వచ్చారు

కొట్టడానికి కూడా వచ్చారు

తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ తారా స్థాయికి వెళ్లే సీన్ లో కృష్ణ, నాగార్జున నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వస్తారని ఇక ఆ సీన్ చూసిన కృష్ణ అభిమానులు మా ఇంటి మీదకు గొడవకు వచ్చారని గుర్తు చేసుకున్నారు. కొంతమంది అయితే నన్ను కొట్టడానికి కూడా వచ్చారని ఆయన అన్నారు. కృష్ణగారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడు? అలా అనడానికి వీల్లేదు.. ఆ సీన్స్ ని కట్ చేయండి.. లేకపోతే సీన్ వేరేలా మార్చండి అంటూ మా ఇంటి ముందు గొడవకు దిగారని ఆయన అన్నారు.

గొప్ప మనిషి

గొప్ప మనిషి

అయితే అది సినిమా.. కథను, పాత్రను బట్టి చూడాలని, పర్సనల్ గా తీసుకోవద్దు అని నేను నచ్చచెప్పినా వినలేదని అన్నారు. కృష్ణ గారిపై వారికి అంత అభిమానం ఉందని అన్నారు.. ఇక కృష్ణ గారి గురించి చెబుతూ చాలా గొప్ప వ్యక్తి అని, నిర్మాతల హీరో అంక్ ఒక నిర్మాత ప్లాప్ లో డబ్బులు పోగొట్టుకుంటే.. ఇంటికి పిలిచి ఆయనతో మాట్లాడి .. కొత్త సినిమా తాను చేస్తానని చెప్పేవాడిని అన్నారు. నిర్మాత డబ్బులు లేవని చెప్పినా అవన్నీ తరువాత మీరు సినిమా మొదలు పెట్టండి అని భరోసా ఇచ్చేవాడని. అలాంటి గొప్ప మనిషిని నేను ఇంతవరకు చూడాలేదు" అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X