మహేష్ బాబు ట్వీట్‌తో పరవశించిపోయిన దర్శకుడు!
Recommended Video

ఏఆర్ మురుగదాస్, స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతున్నా కలెక్షన్లపై ప్రభావం చూపడం లేదు. ఇదిలా ఉండగా సర్కార్ చిత్రానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కార్ చిత్రం గురించి ట్వీట్ చేశారు. ఇది మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిలిం. సర్కార్ చిత్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశా. పొలిటికల్ అంశాలు ఆకట్టుకున్నాయి అంటూ సూపర్ స్టార్ మహేష్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.

మహేష్ ట్వీట్ పై తాజాగా మురుగదాస్ స్పందించాడు. మహేష్ ని సర్ అని సంభోదిస్తూ.. మీకు ఈ చిత్రం నచ్చడం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం.. థాంక్యూ అంటూ మురుగదాస్ స్పందించాడు. మురుగదాస్, మహేష్ కాంబినేషన్ లో గత ఏడాది స్పైడర్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మహేష్ అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది.


Click it and Unblock the Notifications











