హీరోగా మరో ప్రయోగానికి సిద్దమైన కమెడియన్ సప్తగిరి.. విలన్ గా మ్యూజిక్ డైరెక్టర్!

కమెడియన్ నుంచి హీరోగా మారిన మంచి నటులలో సప్తగిరి ఒకరు. చిన్న చిన్న కామెడీ రోల్స్ నుంచి మెయిన్ కమెడియన్ గా గుర్తింపు అందుకున్న సప్తగిరికి హీరో అవ్వడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఇక చాలా కాలం తరువాత మరొక విభిన్నమైన సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు రెగ్యులర్ కమెడియన్ గా కూడా కొనసాగుతున్నాడు.

సప్తగిరి చివరగా హీరోగా చేసిన సినిమా వజ్ర కవచర గోవింద. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో గుర్తింపు దక్కలేదు. అనంతరం హీరోగా చేసే ఛాన్సులు చాలా వచ్చినప్పటికీ ఒప్పుకోలేదు. ఇక చాలా రోజుల తరువాత కె.ఎం.కుమార్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాను హడావుడి లేకుండా పూర్తి చేశారు. ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Music director villain role in Sapthagiri upcoming movie

ఇక సప్తగిరికి జోడిగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. ఇక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇదివరకే పలాస.1978 సినిమాలో పవర్ఫుల్ పాత్రలో నటించిన రఘు కుంచె మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరొక నెగిటివ్ రోల్ తో ఎట్రాక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో సప్తగిరి ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X