అక్కడ ప్రత్యర్థి...కానీ ఇక్కడ రామ్ చరణ్ నా తమ్ముడు!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న #ఆర్‌సి 12లో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి వివేక్ ఒబెరాయ్ షూటింగ్ పార్ట్ శనివారం ముగిసింది.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఈ బాలీవుడ్ స్టార్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్‌తో తనకున్న అనుబంధం గురించి అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవితో పోలుస్తూ చెర్రీపై ప్రశంసల వర్షం కురిపించారు.

కెమెరా ముందు వారియర్స్, కానీ మేము బ్రదర్స్
కెమెరా ముందు మాత్రమే మేము ‘వారియర్స్'.... రియల్ లైఫ్‌లో మేము అన్నదమ్ముల్లా ఉంటామంటూ వివేక్ ఒబెరాయ్ రామ్ చరణ్ గురించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో కలిసి దిగిన సెల్ఫీనిఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
చిరంజీవిలోని అన్ని క్వాలిటీస్ ఉన్నాయి
రామ్ చరణ్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా, గొప్పగా అనిపించింది. నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదములు. మీ నాన్నలోని అన్ని గొప్ప లక్షణాలు నీలో ఉన్నాయి అని వివేక్ ఒబెరాయ్ వ్యాఖ్యానించారు.

టైటిల్ ఏమిటో?
రామ్ చరణ్ కెరీర్లో 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ‘వినయ విధేయ రామ' అనే టైటిల్ ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

ఆ ప్రచారంలో నిజం లేదు
ఆర్ సి 12 సినిమా ఆలస్యం అవుతోందని, ముందుగా అనుకున్నట్లుగా సంక్రాంతికి రాక పోవచ్చే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని, నవంబర్ 10వ తేదీకి షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని, తర్వాత మరో రెండు పాటుల పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని నిర్మాత దానయ్య తెలిపారు.

ముఖ్య పాత్రల్లో...
ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











