బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్... కూతురు కోసం తెచ్చిన ఎమోషనల్ గిఫ్ట్ ఇదే!
బిగ్‌బాస్ తెలుగు 2 టైటిల్ విజేతగా నిలిచిన కౌశల్.... ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం తన కూతురు కోసం బిగ్ బాస్ ఇంటి నుండి తెచ్చిన గిఫ్టును చిట్టితల్లికి బహూకరించాడు. ఇంతకీ కౌశల్ ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏమిటో తెలుసా...? తానే స్వయంగా తయారు చేసిన బొమ్మ. ఈ మేరకు ఓ వీడియో పోస్టు చేసిన కౌశల్ ఇంట్లో ఉన్నంతకాలం ఆ బొమ్మలోనే తన కూతురును చూసుకున్నానని తెలిపారు.
ఇది నేను బిగ్‌బాస్ హౌస్ నుంచి నా కూతురు కోసం తెచ్చిన గిఫ్ట్. మాకు ఒక టాస్క్ లో ఇచ్చిన చిన్న చిన్న ప్రాపర్టీస్‌తో నేను స్వయంగా తయారు చేసి తెచ్చిన ఈ మా లిటిల్ లల్లీ. బిగ్ బాస్ హౌస్‌లో ఈ లిటిల్ లల్లీని రోజూ నా పక్కన పడుకోబెట్టుకుని ఇందులోనే నా కూతురు లల్లీని చూసుకునేవాడిని... అని కౌశల్ గుర్తు చేసుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత తొలిసారిగా ఫేస్ బుక్ పేజీలో ఓ వీడియో పోస్టు చేసిన కౌశల్... ఈ పప్పీ లల్లీని ఇపుడు మీ అందరి సమక్షంలో మా లల్లీకి గిఫ్టుగా ఇస్తున్నాను. బిగ్ బాస్ హౌస్‌లో నాతో స్పెండ్ చేసిన ఏకైక మా చిట్టితల్లి ఈ బుల్లి లల్లీ. బిగ్ బాస్ టైటిల్‌తో పాటు మా ల్లీ కోసం స్వయంగా నా చేత్తో తయారు చేసిన బొమ్మను గిఫ్ట్‌గా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది అని కౌశల్ చెప్పుకొచ్చారు.

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుండి 39.5 కోట్ల ఓట్లు రావడంతో కౌశల్‌కు తిరుగులేకుండా పోయింది. దీంతో బిగ్‌బాస్ 2 టైటిల్‌తో రూ. 50 లక్షల ఫ్రైజ్ మనీ సొంతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











