మెగాస్టార్ సినిమా టైటిల్.. మళ్ళీ ఎవరి కోసం!
1984 లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం 'హీరో' ఘనవిజయం సాధించింది. చిరు, రాధిక కాంబినేషన్ లో ఈ చిత్రం వచ్చింది. ఈ టైటిల్ పై ఆ తరువాత పలు చిత్రాలు వచ్చాయి. మరో మారు ఇదే టైటిల్ తో సినిమా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇటీవల హీరో టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది.
స్టార్ హీరోలతో వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ సంస్థ ఆ టైటిల్ ని ఎవరికోసం రిజిస్టర్ చేయించిందనే చర్చ మొదలైంది. మైత్రి మూవీస్ సంస్థ ప్రస్తుతం రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోని, నాగ చైతన్యతో సవ్యసాచి చిత్రాలని నిర్మిస్తోంది. మరవైపు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించే సినిమాకు కూడా మైత్రి మూవీస్ వారే నిర్మించనున్నారు.

మహేష్ చిత్రానికి అలాంటి టైటిల్ ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఏ చిత్రం కోసం ఈ టైటిల్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. రంగస్థలం చిత్రంలో ఘనవిజయం అందుకున్న మైత్రి మూవీస్ త్వరలో క్రేజీ చిత్రాల్ని క్యూలో పెడుతోంది.


Click it and Unblock the Notifications











