twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇదే తొలిసారి.. రాజమౌళి కారణంగా! తప్పడం లేదు..

    |

    దాదాపు 20 ఏళ్ల క్రిందట కెరీర్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అయి టాలీవుడ్ టాప్ స్టార్‌గా నిలిచారు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసే ఎన్టీఆర్.. ఇప్పుడు రాజమౌళి కారణంగా రెండేళ్ల గ్యాప్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..

    ఎప్పుడూ లేదు.. 2009లో మాత్రమే

    ఎప్పుడూ లేదు.. 2009లో మాత్రమే

    కెరీర్ ఆరంభంలో ఏడాదికి మూడు సినిమాలు కూడా చేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రతీ ఏడాది రెండు లేదా ఒక్క సినిమానైనా ప్రేక్షకుల ముందుంచారు. గతంలో 2009లో మాత్రమే ఎన్టీఆర్ ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ తర్వాత మళ్ళీ 2018 దాకా ప్రతీ సంవత్సరం వెండితెరపై అభిమానులను పలకరించారు ఎన్టీఆర్.

    రాజమౌళి డిసీజన్.. ఇదీ పరిస్థితి

    రాజమౌళి డిసీజన్.. ఇదీ పరిస్థితి

    అయితే అప్పుడు ఒక్క సంవత్సరం గ్యాప్ వస్తే.. ఇప్పుడు ఏకంగా రెండు సంవత్సరాలు గ్యాప్ వస్తోంది. చివరగా 2018లో ''అరవింద సమేత'' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్.. 2019లో వెండితెరకు సెలవిచ్చారు. 2020లో ఆయన పలకరిస్తారనుకుంటే అది కూడా లేదని స్పష్టం చేశారు రాజమౌళి. ఇలా 2019, 2020 రెండేళ్లు కూడా ఎన్టీఆర్ సినిమాలు లేకుండానే గడుస్తున్నాయి.

     RRR వాయిదా.. 2020లో కూడా ఎన్టీఆర్ మూవీ లేనట్లే

    RRR వాయిదా.. 2020లో కూడా ఎన్టీఆర్ మూవీ లేనట్లే

    ప్రస్తుతం ఎన్టీఆర్ RRR మూవీలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాను 2020 జులై 30న విడుదల చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ ఆలస్యమవుతుండటం కారణంగా 2021 జనవరి 8కి వాయిదా వేశారు. దీంతో 2020లో కూడా ఎన్టీఆర్ మూవీ లేనట్లే అని స్పష్టమయింది.

     రాజమౌళి కారణంగానే.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే తొలిసారి

    రాజమౌళి కారణంగానే.. ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే తొలిసారి

    అయితే ఎన్టీఆర్ ఇలా రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకోవడానికి పరోక్షంగా కారణమయ్యారు రాజమౌళి. RRR ప్రాజెక్టు భారీ ఎత్తున రూపొందిస్తున్నారు కాబట్టి ఈ గ్యాప్ తప్పలేదు. అయితే రాజమౌళికి ఇది అలవాటే అయినప్పటికీ.. ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కెరీర్‌లో మాత్రం రెండేళ్ల గ్యాప్ అనేది ఇదే తొలిసారి కావడం విశేషం.

     RRR మూవీ.. బాలీవుడ్, హాలీవుడ్ బ్యూటీలు

    RRR మూవీ.. బాలీవుడ్, హాలీవుడ్ బ్యూటీలు

    డీవీవీ దానయ్య నిర్మిస్తున్న RRR మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.

    English summary
    Rajamouli's RRR movie post pone topic viral on social media. Now unit officially announced movie release date as January 8th 2021. So ntr will not appear in silver screen in 2020 also. This is hot topic now in filmnagar circles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X