Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇదే తొలిసారి.. రాజమౌళి కారణంగా! తప్పడం లేదు..
దాదాపు 20 ఏళ్ల క్రిందట కెరీర్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీ అయి టాలీవుడ్ టాప్ స్టార్‌గా నిలిచారు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసే ఎన్టీఆర్.. ఇప్పుడు రాజమౌళి కారణంగా రెండేళ్ల గ్యాప్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి పోతే..
ఎప్పుడూ లేదు.. 2009లో మాత్రమే
కెరీర్ ఆరంభంలో ఏడాదికి మూడు సినిమాలు కూడా చేసిన ఎన్టీఆర్.. ఆ తర్వాత ప్రతీ ఏడాది రెండు లేదా ఒక్క సినిమానైనా ప్రేక్షకుల ముందుంచారు. గతంలో 2009లో మాత్రమే ఎన్టీఆర్ ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ తర్వాత మళ్ళీ 2018 దాకా ప్రతీ సంవత్సరం వెండితెరపై అభిమానులను పలకరించారు ఎన్టీఆర్.
రాజమౌళి డిసీజన్.. ఇదీ పరిస్థితి
అయితే అప్పుడు ఒక్క సంవత్సరం గ్యాప్ వస్తే.. ఇప్పుడు ఏకంగా రెండు సంవత్సరాలు గ్యాప్ వస్తోంది. చివరగా 2018లో ''అరవింద సమేత'' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్.. 2019లో వెండితెరకు సెలవిచ్చారు. 2020లో ఆయన పలకరిస్తారనుకుంటే అది కూడా లేదని స్పష్టం చేశారు రాజమౌళి. ఇలా 2019, 2020 రెండేళ్లు కూడా ఎన్టీఆర్ సినిమాలు లేకుండానే గడుస్తున్నాయి.
RRR వాయిదా.. 2020లో కూడా ఎన్టీఆర్ మూవీ లేనట్లే
ప్రస్తుతం ఎన్టీఆర్ RRR మూవీలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ముందుగా ఈ సినిమాను 2020 జులై 30న విడుదల చేస్తామని ప్రకటించారు కానీ షూటింగ్ ఆలస్యమవుతుండటం కారణంగా 2021 జనవరి 8కి వాయిదా వేశారు. దీంతో 2020లో కూడా ఎన్టీఆర్ మూవీ లేనట్లే అని స్పష్టమయింది.
రాజమౌళి కారణంగానే.. ఎన్టీఆర్ కెరీర్లో ఇదే తొలిసారి
అయితే ఎన్టీఆర్ ఇలా రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకోవడానికి పరోక్షంగా కారణమయ్యారు రాజమౌళి. RRR ప్రాజెక్టు భారీ ఎత్తున రూపొందిస్తున్నారు కాబట్టి ఈ గ్యాప్ తప్పలేదు. అయితే రాజమౌళికి ఇది అలవాటే అయినప్పటికీ.. ఇక్కడ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కెరీర్లో మాత్రం రెండేళ్ల గ్యాప్ అనేది ఇదే తొలిసారి కావడం విశేషం.
RRR మూవీ.. బాలీవుడ్, హాలీవుడ్ బ్యూటీలు
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న RRR మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది.