బాలయ్యపై నాగబాబు షాకింగ్ కామెంట్.. మహేష్ బాబు గురించి అదిరిపోయేలా!
మెగాబ్రదర్ నాగబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణపై ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ, బాలయ్య గురించి స్పందించాలని నాగబాబును కోరగా... ఆయన తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఆర్జీవీ గురించి 150 ఫంక్షన్లో చెప్పాను. అయిపోయిందేదో అయిపోయింది నేను మామూలుగా ఉన్నాను. తర్వాత జరిగిన సంఘటన పేర్లు కూడా ఎత్తడం నాకు ఇష్టం లేదు. ఆ పేర్లు ఎత్తడం నాకు చిరాకు. అక్కడ అతడి ఇన్వాల్మెంట్ చూసి అతడిపై ఉన్న అభిప్రాయం పోయింది. ఆర్జీవి గురించి చెప్పడానికి ఏమీ ఓపీనియర్ లేదు అన్నారు. బాలయ్య బాబు గురించి చెప్పండి అనగానే ... నాగబాబు విచిత్రంగా స్పందించారు.

బాలయ్య ఎవరో నాకు తెలియదు
‘‘బాలయ్య ఎవరో నాకు తెలియదు, ఐయామ్ వెరీ సారీ. (ఒక్కక్షణం ఆగి) ఏయ్.. బాలయ్య గురించి తెలియదు అన్నానేంటి? బాలయ్య గారు చాలా పెద్ద ఆర్టిస్టు. సీనియర్ మోస్ట్... నేరము శిక్షలో కృష్ణగారు, ఆయన కలిసి యాక్ట్ చేశారు'' అని సినీయర్ నటుడు బాలయ్య గురించి చెప్పుకొచ్చారు నాగబాబు.

నందమూరి బాలకృష్ణ పేరు ఎప్పుడూ వినలేదు
మేము అడిగింది ఆ బాలయ్య గురించి కాదండీ.. నందమూరి బాలకృష్ణ గురించి అని యాంకర్ అడగ్గాగానే... నాగబాబు రియాక్ట్ అవుతూ ‘నేనెప్పుడూ ఆయన పేరు వినలేదు. నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్' అంటూ స్కిప్ చేసే ప్రయత్నం చేశారు. బాలయ్య పేరు వినలేదని చెప్పడం అనేది ఆశ్చర్యంగా ఉంది. ఆర్టిస్టులగా మీరు అందరూ ఒకే కుటుంబం. కానీ పొలిటికల్ రైవలరీలో అలా మాట్లాడుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగానే... ‘నాకు ఎవరూ తెలియదండీ బాబూ' అంటూ రుసరుసలాడారు మెగాబ్రదర్.

కళ్యాణ్ బాబుకు సమానమైన వ్యక్తి మహేష్ బాబు
మహేష్ బాబు గురించి ఒక్క మాటలో చెప్పండి అని అడగ్గానే.... నాగబాబు స్పందిస్తూ ఆయన గురించి చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఆయన గురించి ఒక్క మాట కాదు పది మాటలైనా చెప్పొచ్చు. ఈ రోజు మోస్ట్ హ్యాండ్సప్ హీరో, కళ్యాణ్ బాబుకు ఆల్మెస్ట్ ఈక్వల్ పాపులారిటీ, బిజినెస్ ఉన్న వ్యక్తి. కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ... తన పనేదో తాను చేసుకుంటూ ఒక పెద్ద స్టార్ అయ్యాడు.
ప్రిన్స్ అనే మాటకు తగిన వ్యక్తి
మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణగారి అబ్బాయి. ఆయనకు వంద అడ్వాంటేజెస్ ఉన్నాయి. జనాలు విపరీతంగా ఆదరిస్తారు. ఈ మధ్యనే బిజినెస్‌లోకి దిగారు, థియేటర్ కట్టారు. ఆయనకు లేడీ పాలోయింగ్ కూడా ఎక్కువ. మా మిసెస్ గ్రూపు వ్యక్తులు మహేష్ బాబును ఒక తమ్ముడు లాగా, ఒక కొడుకులాగ ఫీలవుతుంటారు. యంగ్‌గా ఉండే అమ్మాయిలు మహేష్ బాబును రొమాంటిక్ గా ఊహించుకుంటారు. ఆయనకు ఆల్రెడీ పెళ్లయిపోయింది కాబట్టి కొందరు డిప్రెషన్లో ఉంటారు. ప్రిన్స్ అనే మాటకు తగిన వ్యక్తి..... అంటూ నాగబాబు ప్రశంసలు గుప్పించారు.


Click it and Unblock the Notifications











