అప్పుడు సమంతకు పెట్టిన ముద్దు.. చివరి శ్వాస వరకు.. నాగ చైతన్య చెరగని జ్ఞాపకం
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యిపోయారు. మరోవైపు బ్యూటీఫుల్ హీరోయిన్ శోభితా ధూళిపాళను కూడా పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే 'తండేల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్రహ్మండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద రూ.106 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ వసూల్ చేసిందీ చిత్రం. చైతూ కెరీర్ లో ఈ ఫిల్మ్ హ్యయేస్ట్ ఓపెనింగ్ డే, హ్యయేస్ట్ గ్రాస్ వసూల్ చేసిన చిత్రంగా, మొదటి రూ.100కోట్ల సినిమాగా నిలిచింది.
చైతూ 'తండేల్'తో ఓవైపు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైతన్యకు సంబంధించిన ఓల్డ్ వీడియోస్ కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో చైతూ ఫస్ట్ కిస్ పై చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడం విశేషం. చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను 2017లో పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే వీరిద్దరు కలిసి 'ఏ మాయ చేసావే' చిత్రంలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ మూవీలో చైతూ, సామ్ రొమాన్స్ సీన్లు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంటాయి.

అయితే, టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి గతంలో హోస్ట్ చేసిన 'నెం.1 యారి' సెలబ్రెటీ టాక్ షోకు నాగచైతన్య హాజరయ్యారు. సమంతతో పెళ్లికి నాలుగేళ్ల ముందే ఈ ఎపిసోడ్ షూట్ జరిగింది. ఆ సమయంలో నాగచైతన్యను రానా దగ్గుబటి కాస్తా ఇబ్బందికరమైన ప్రశ్నను అడిగారు. నాగచైతన్య మొదటి ముద్దు ఎప్పుడని? అడిగాడు. అందుకు చైతూ ఆసక్తికరంగా బదులిచ్చాడు. తన నైన్త్ గ్రేడ్ లో మొదటి కిస్ అయ్యిందన్నారు. ఆ కిస్ తన మిగిలిన జీవితానికి మొత్తం సరిపోయిందంటూ.. బదులిచ్చాడు.
చైతూ సమంతను పెళ్లి చేసుకోవడానికి ముందే.. ఇలాంటి కామెంట్స్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గ్గా మారింది. ఏదేమైనా చైతన్యకు ఆ ఫస్ట్ కిస్ మెమోరీగా ఉండటం విశేషం. అలాగే ఆయనకు విజయవాడలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఓసారి బిగ్ కాంప్లిమెంట్ దక్కిందని కూడా చెప్పారు.అభిమాని ఒకరు చైతూను సమంత కంటే అందంగా ఉంటారని చెప్పడం ఆయనకు మెమోరబుల్ గా ఉందన్నారు. అయితే ఇవన్నీగత విశేషాలు. ప్రస్తుతం చైతూ తండేల్ సక్సెస్ జోరులో ఉండటం ఇవన్నింటినీ ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
ఇక పెళ్లైన నాలుగేళ్లకు నాగచైతన్య - సమంత విడిపోయి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఇప్పటి నాలుగేళ్లు గడిచినా వారు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో నిజం బయటపెట్టలేదు. ఇంకా సోషల్ మీడియాలో మాత్రం పుకార్లు షికార్లు చేశాయి. ఏదేమైనా అటు సమంత రూత్ ప్రభు, ఇటు నాగచైతన్య తమతమ కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యారు. చైతూ సెకండ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. సమంత కూడా విడాకుల తర్వాత మయోసైటిస్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి తన హెల్త్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూనే... మరోవైపు క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. చివరిగా రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన 'సిటాడెల్ : హనీ, బన్నీ' సిరీస్ లో యాక్షన్ తో అదరగొట్టింది. నెక్ట్స్ 'రక్త్ భ్రమండ్' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











