మంచు విష్ణు ‘మోసగాళ్లు’.. అలా నాగ చైతన్య సాయం
ప్రస్తుతం మంచు విష్ణు తన ఆశలన్నీ కూడా మోసగాళ్లు సినిమాపై ఉన్నాయి. చాలా రోజులు తరువాత మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాడు. యధార్థ ఘటనల ఆధారంగా బిగ్గెస్ట్ ఐటీ స్కాం నేపథ్యంలో రాబోతోన్న మోసగాళ్లు సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. హాలీవుడ్ డైరెక్టర్, అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ కోసం ఇండస్ట్రీలో చాలా మంది సాయం చేస్తున్నారు. ప్రమోట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.
మొన్నీ మధ్యనే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రానా రావడం, అంతకు ముందు చిరంజీవి ట్రైలర్‌ను రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే. ఇలా మోసగాళ్లు సినిమాకు ఇప్పుడు మంచి బజ్ ఏర్పడింది. మార్చి 19న ఈ మూవీని దేశం మొత్తం అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ప్యాన్ ఇండియన్ లెవెల్‌లో రాబోతోన్న ఈ మూవీ టైటిల్‌ను మార్చేశారు. తెలుగులో మోసగాళ్లు అని ఉండగా.. మిగతా అన్ని భాషల్లో అను అండ్ అర్జున్ అని ఉండోబోతోంది.

అయితే తాజాగా ఈ మూవీ కోసం నాగ చైతన్య ముందుకు వచ్చాడు. తన వంతుగా మోసగాళ్లు గురించి చెబుతూ ఓ ట్వీట్ వేశాడు. మంచు విష్ణు, కాజల్ కోసం నాగ చైతన్య ఇలా ట్వీట్ వేసి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. యదార్థ ఘటనల తెరకెక్కించిన మోసగాళ్లు సినిమాను చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అంటూ నాగ చైతన్య ట్వీట్ వేశాడు. మంచు విష్ణు, కాజల్, సునీల్ శెట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











