అందుకే డిస్‌కనెక్ట్ అయ్యా.. మెంటల్ టార్చర్ కారణంగానే అంటూ నాగ చైతన్య
అక్కినేని వారసుడిగా టాలీవుడ్ గడపతొక్కి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు నాగార్జున తనయుడు నాగ చైతన్య. తండ్రికి తగ్గ కొడుకుగా లేడీ అభిమానులను కూడగట్టుకున్నాడు. తనదైన నటనా ప్రతిభతో పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమవుతున్న ఆయన.. ఈ మధ్యకాలంలో నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి నాగ చైతన్య చేసిన కొన్ని కామెంట్స్ మరోసారి ఆయన్ను వార్తల్లోకి తీసుకొచ్చాయి. ఇంతకీ చైతూ ఏమన్నారు? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

నాగ చైతన్య జోష్..
నాగ చైతన్య నటించిన మొదటి సినిమా జోష్. అలా కెమెరా ముందుకొచ్చిన ఈ సినీ వారసుడు అదే జోష్ కంటిన్యూ చేస్తూ సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. మీడియం రేంజ్ హీరోగా తెలుగు తెరపై ఆయన హంగామా నడుస్తోంది. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలతో రాణిస్తున్న ఆయన కెరీర్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సమంతతో రిలేషన్.. బ్రేకప్
ఏ మాయ చేశావే సినిమాలో సమంతతో కలిసి నటించిన నాగ చైతన్య ఆమెను ప్రేమించి పెళ్లాడారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువకాలం నిలవకపోవడం, పెళ్ళైన నాలుగేళ్లకే సమంతతో డివోర్స్ తీసుకోవడం జనాల్లో హాట్ టాపిక్ అయింది.

విడాకుల తర్వాత సీన్.. చైతూ స్పీడ్
సమంతతో విడాకులు తీసుకున్నాక తన పూర్తి శ్రద్ద సినిమాలపైనే పెట్టారు నాగ చైతన్య. ఈ నేపథ్యంలోనే క్యారెక్టర్‌కి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా థాంక్యూ సినిమా చేసిన ఈ అక్కినేని వారసుడు లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లారు. దీంతో డివోర్స్ తర్వాత చైతూ జోష్ రెట్టింపయింది అనే టాక్ నడుస్తోంది.

సోషల్ మీడియాలో ట్రెండ్.. చై రెస్పాన్స్
ఇకపోతే నాగ చైతన్యకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా సమంత- నాగ చైతన్య విడాకుల తాలూకు విషయాలు ఓ రేంజ్ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాపై తన అభిప్రాయాన్ని చెబుతూ కుండబద్దలు కొట్టేశారు నాగ చైతన్య.

డిస్‌కనెక్ట్ అయ్యా.. నేను చేసేది అదే
తాను సోషల్ మీడియా నుంచి డిస్‌కనెక్ట్ అయ్యానని నాగ చైతన్య అన్నారు. తాను ఆన్లైన్లో చాలా బోరింగ్ ఫీల్ అవుతుంటానని చెప్పారు. అదేవిధంగా తన సినిమా విడుదలవుతున్నప్పుడు ఆ చిత్రం గురించి పోస్ట్ చేయడం కంటే ఎక్కువగా ఆ సినిమా టాపిక్స్ చదువేందుకు ఆసక్తి చూపిస్తాను అని అన్నారు.

అది చెడు మార్గం.. అంత మంచిది కాదు
సోషల్ మీడియా సందేశాల్లో ఫిల్టర్ చేసి మంచిది ఏది.. చెడు ఏది అనేది తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని నాగ చైతన్య చెప్పారు. అలా గుర్తించలేకపోతే సోషల్ మీడియా ఏ మాత్రం మంచిది కాదని.. మిమ్మల్ని అది చెడు మార్గంలో తీసుకెళ్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అన్ని విషయాల్లో లోతుగా అధ్యయనం మానసిక ఆరోగ్యానికి మేలు కాదని చైతూ అన్నారు.


Click it and Unblock the Notifications











