ప్రేయసితో కలిసి ఇటలీలో ఎంజాయ్ చేస్తోన్న నాగచైతన్య!
అదేంటి భార్య సమంత ఉండగా ప్రేయసితో నాగచైతన్య ఇటలీలో ఏం చేస్తున్నాడు అనే అనుమానం మీకు కలగవచ్చు. మీ అనుమానం నిజమే నాగ చైతన్య ఇటలీలో ఎంజాయ్ చేసేది తన రీల్ ప్రియురాలితో. విషయం ఏమిటంటే ప్రస్తుతానికి నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ చైతన్య - రాశి ఖన్నా జంటగా నటిస్తున్నారు. అయితే కరోనా కేసులతో సంబంధం లేకుండానే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతానికి ఇటలీ అలాగే యూరప్ లోని మరి కొన్ని ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
మిగతా చోట్లతో పోలిస్తే ఇటలీలో కాస్త కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్న కారణంగా ఈ సినిమా ఎలాంటి అడ్డంకులు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగచైతన్య రాశి ఖన్నా లు లవర్స్ గా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సీక్వెన్స్ లు, కొన్ని సాంగ్స్ కూడా ప్రస్తుతం ఇటలీలో తెరకెక్కిస్తున్నారన్న మాట. నిజానికి ఈ ఇద్దరూ కలిసి గతంలో వెంకీ మామ అనే సినిమాలో కూడా జంటగా నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సెంటిమెంట్ పరంగా కూడా ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకంతో ఉన్నాడు నాగ చైతన్య. నిజానికి ఈ సినిమా 2021 ద్వితీయార్ధంలో రిలీజ్ చేయాలని భావించారు.

కానీ ప్రస్తుతం థియేటర్లు మూసివేసి ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడిన నేపథ్యంలో ఈ సినిమా ఎప్పటికి రిలీజ్ అవుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. నిజానికి నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ 16 రిలీజ్ కావాల్సి ఉంది. అయితే థియేటర్లు మూసివేత గురించి ముందే ఊహించిన ఈ సినిమా యూనిట్ సినిమాని నిరవధికంగా వాయిదా వేసింది. తమ సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడగలిగే సినిమా కాబట్టి అలా ఫ్యామిలీ అంతా వచ్చి చూసే అవకాశం కలిగిన రోజే సినిమాను రిలీజ్ చేస్తామని ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రకటించారు.


Click it and Unblock the Notifications











