అలాంటి పార్టీలలో బట్టలు ఉండవు.. హీరోయిన్ ముందే నాగచైతన్య షాకింగ్ ఆన్సర్
అక్కినేని హీరో నాగచైతన్య నెక్స్ట్ థాంక్యూ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేశాడు. ఇదివరకే వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. జూలై 22వ తేదీన థాంక్యూ సినిమా వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఇక ఈ తరుణంలో నాగచైతన్య ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. అందులో ఒక పార్టీ గురించి చెబుతూ బట్టలు ఉండవు అని చైతూ ఇచ్చిన సమాధానం రాశికి ఆశ్చర్యాన్ని కలిగించేసిందే. ఆ వివరాల్లోకి వెళితే..

హ్యాట్రిక్ పై ఫోకస్
చివరగా బంగార్రాజు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనే విధంగా సక్సెస్ అందుకున్న నాగచైతన్య అంతకుముందు లవ్ స్టోరీ సినిమాతో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వరుసగా రెండు సినిమాలు సక్సెస్ కావడంతో ఇప్పుడు రాబోయే థాంక్యూ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

మళ్ళీ హిట్ కాంబినేషన్
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ సినిమాపై మొదటి నుంచి కూడా మంచి హైప్ అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వీరి కలయికలో మనం అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా అక్కినేని హీరోలకు మర్చిపోలేని ఒక బెస్ట్ మూమెంట్ గా నిలిచింది. ఇక ఇన్నాళ్లకు మళ్ళీ నాగచైతన్య విక్రమ్ తో కలిసి వర్క్ చేస్తుండడంతో ఈ సినిమాకు మార్కెట్లో అయితే కొంత డిమాండ్ పెరిగింది.

ప్రమోషన్స్ లో బిజీగా..
ఇక ప్రమోషన్స్ తక్కువగా చేస్తున్నారని అనుకుంటున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు కాస్త స్పీడ్ పెంచారు. ప్రస్తుతం నాగచైతన్య రాశికన్నా ఇద్దరు కూడా తీరిక లేకుండా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయితే ఇటీవల నాగచైతన్య ఒక యాంకర్ నుంచి ఎదుర్కొన్న ప్రశ్నలకు ఎవరు ఊహించిన విధంగా సమాధానం ఇచ్చాడు. అతను ఇచ్చిన సమాధానంకు రాశి కూడా ఆశ్చర్యపోయింది.

ఆ పార్టీలో జరిగే విషయాలు
యాంకర్ అడిగిన ప్రశ్నకు వెంటనే ఐదు సెకండ్లలో మూడు సమాధానాలు చెప్పాలి నాగచైతన్యను అడిగారు. ఇక చైతూ టకటక సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బ్యాచిలర్ పార్టీస్ లో ఎక్కువగా జరిగే మూడు విషయాల గురించి చెప్పాలి అని అనడంతో మొదట రాశి ఖన్నా సాధారణంగా డ్రింక్ చేయడం ఆ తర్వాత డాన్స్ ఫన్ అంటూ చాలా సింపుల్ గా సమాధానం చంపేసింది.

బట్టలు ఉండవు అంటూ.
.
అయితే నాగచైతన్య మాత్రం ఎవరు ఊహించిన విధంగా చాలా బోల్డ్ గానే సమాధానం ఇచ్చాడు. బట్టలు ఉండవు అంటూ బాటిల్స్ కూడా అన్ని అయిపోతాయని అలాగే ఎవరూ కూడా నిద్రపోరు అని ఒకవేళ నిద్ర పోయినా ఇతరులు నిద్రపోనివ్వరు అని కూడా సరదాగా సమాధానం ఇచ్చాడు. చాలా ఓపెన్ గానే కొంతమంది ఎంజాయ్ చేస్తుంటారు అని నాకు చైతన్య వివరణ ఇచ్చిన విధానంతో పక్కనే ఉన్న రాశి ఖన్నా షాక్ అయ్యింది. కానీ నాగచైతన్య మాత్రం చాలా సరదాగానే ఆ సమాధానం ఇచ్చాడు. ఇక విక్రమ్ దర్శకత్వంలోనే చైతన్య దూత అనే మరో వెబ్ సీరీస్ చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











