మంచో..చెడో.. తెలియాల్సిన వారికి అంతా తెలుసు.. సమంతతో విడాకులపై ఘాటుగా నాగచైతన్య
నాగచైతన్య అక్కినేని, సమంత రుత్ ప్రభు విడాకులు తీసుకొని ఏడాది కావొస్తున్న ఈ అంశంపై రకరకాల కథనాలు మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. నాగచైతన్య నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్టు 12వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జాతీయ మీడియాకు చైతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో సమంతతో విడాకుల అంశాన్ని జాతీయ మీడియా ఈటీ టైమ్స్ మరోసారి ప్రస్తావిస్తే.. నాగచైతన్య స్పందించిన తీరు ఎలా ఉందంటే?

నా మాజీ భర్త అంటూ సమంత
కరణ్ జోహర్ హోస్ట్‌గా నిర్వహించే కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షోలో సమంత చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. వారిద్దరి మధ్య సఖ్యత లేదనే విషయాన్ని సమంత మాటలు స్పష్టం చేశాయి. కరణ్ జోహర్ మాట్లాడుతూ.. నీ భర్త అంటే.. కాదు.. నా మాజీ భర్త అంటూ సమంత ఘాటుగా స్పందించింది. డైవోర్స్ తర్వాత జీవితం చాలా టఫ్‌గా మారింది. ఆ బాధ నుంచి బయటపడి.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అని సమంత చెప్పడం తెలిసిందే. ఈ క్రమంలో సమంత గురించి నాగచైతన్య స్పందించారు.

ఇద్దరం కలిసి తీసుకొన్న నిర్ణయం
వైవాహిక జీవితంలో కొనసాగించలేమని నిర్ణయించుకొన్న తర్వాత నేను, సమంత విడాకులు తీసుకోవాలనుకొన్నాం. ఆ సమయంలో సామరస్య పూర్వకంగా మా సందేశాన్ని సోషల్ మీడియాలో ప్రకటించాం. ఇక నా వ్యక్తిగత జీవితంలో ఆ విషయానికి ముగింపు పలికాను. నా జీవితంలో మంచో,చెడో నేను ఒక నిర్ణయం తీసుకొన్నాననే విషయాన్ని మీడియాకు కూడా చెప్పాను. నేను చెప్పాలనుకొన్న విషయాన్ని విడాకులు తీసుకొన్న తర్వాత సోషల్ మీడియాలో చెప్పాను అని నాగచైతన్య అన్నారు.

సమంత జీవితం అలా.. నా లైఫ్ ఇలా
మా విడాకులు ప్రకటన తర్వాత మా జీవితాలను మేము ఆస్వాదిస్తున్నాం. సమంత తన జీవితంతో ముందుకు వెళ్తున్నది. నేను నా జీవితం, కెరీర్‌తో ముందుకెళ్తున్నాను. మా మధ్య ఏం జరిగిందని, ఏం జరుగుతున్నదనే విషయాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన పనిలేదు. అదంతా మా వ్యక్తిగత జీవితం అని నాగచైతన్య అన్నారు.

మా విడాకుల కారణం అది
సమంత, నేను విడిపోవడం వెనుక కారణాలు నా ఫ్యామిలీకి, నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు తెలుసు. మా విడాకుల కారణం అది.. ఇది అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వచ్చే ఊహాగానాలన్నీ తాత్కాలికంగా గొడవ చేస్తుంటాయి. అలాంటి వార్తలకు సమాధానం ఇస్తే.. ఇంకా వార్తలు సృష్టిస్తూనే ఉంటారు. నాపై వచ్చే ఊహాగానాలు, రూమర్లను ఎంజాయ్ చేస్తుంటాను. వచ్చే వార్తలు అలాగే వస్తుంటాయి. వాటంతట అవే కనుమరుగైపోతాయి అని నాగచైతన్య అభిప్రాయపడ్డారు.

ఏదో జరిగిపోయింది.. మళ్లీ ఆలోచించడం ఎందుకు?
మా విడాకుల గురించి నేను, సమంత చెప్పాలనుకొన్నది మేము చెప్పాం. ఇక మా గురించి మేము చెప్పాల్సిందే ఏమీ లేదు. మంచో, చెడో మా మధ్య జరిగిపోయింది. ఇక ఆ విషయం గురించి నేను మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇక ఆ విషయం గురించి ఆలోచించడం అవసరం లేదనేది నా అభిప్రాయం అని నాగచైతన్య చెప్పారు.


Click it and Unblock the Notifications











