నాగ చైతన్య షాకింగ్ డెసీషన్: ఇప్పటి వరకు ఎవరూ చేయని పాత్రకు గ్రీన్ సిగ్నల్

అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. కెరీర్‌ ఆరంభంలోనే పలు విజయాలను అందుకున్న అతడు.. కొంత కాలం పాటు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'మజిలీ' అనే మూవీ నుంచి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ వెంటనే 'వెంకీ మామ'తో మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే 'లవ్ స్టోరీ' అనే చిత్రంతో హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

'లవ్ స్టోరీ' మూవీ పట్టాలపై ఉన్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. ఇది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నారు. ఈ మూవీపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు, హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంలోనూ కీలక పాత్రను చేస్తున్నాడు. ఇందులో దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా అతడు పూర్తి చేసేశాడు.

 Naga Chaitanya Cruel Role in Amazon Prime Web Series

ప్రస్తుతం నాగ చైతన్య నటిస్తోన్న చిత్రాల్లో 'బంగార్రాజు' ఒకటి. ఇందులో అక్కినేని నాగార్జున కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన'కు ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఇది పలు షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసేసుకుంది. ఇందులో నాగ చైతన్య టైటిల్ రోల్ చేస్తున్నాడు. ఈ మూవీలో అతడికి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. ఇక, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అందుకే చిత్రీకరణను శరవేగంగా జరుపుకుంటున్నారు.

ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న అక్కినేని నాగ చైతన్య.. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. దీన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న దీని ద్వారానే ఈ టాలెంటెడ్ హీరో ఓటీటీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర ఎంతో కొత్తగా ఉండబోతుందని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అతడి రోల్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌లో అక్కినేని నాగ చైతన్య క్రూరమైన విలన్ పాత్రను చేస్తున్నాడట. ఒకరకంగా ఇది సైకోను పోలి ఉంటుందని అంటున్నారు. హీరోగా సత్తా చాటుతోన్న అతడు.. ఇప్పుడీ ప్రయోగం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఇందులో అతడికి జోడీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోందని సమాచారం. ఈ క్రైమ్ హర్రర్ వెబ్ సిరీస్‌ను విక్రమ్ కే కుమార్‌ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ ఏరియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X