ఆ ప్రాజెక్ట్ కోసం మొదటిసారి చెడుగా కనిపించనున్న చైతూ.. స్మార్ట్ లుక్ లోనే విభిన్నంగా..

అక్కినేని యువ హీరో నాగచైతన్య ఇటీవల కాలంలో తన మార్కెట్ ను అయితే మెల్లగా స్టార్ హీరోల రేంజ్ లో పెంచేసుకుంటున్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అయితే అందుకుంటున్నాయి. ముఖ్యంగా మజిలీ సినిమా నుంచి నాగచైతన్య కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది అనే చెప్పాలి. అతను కూడా మెల్లగా 50 కోట్ల బాక్సాఫీస్ మార్కెట్ ను క్రియేట్ చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. అయితే స్క్రిప్టులను ఎంచుకోవడం దగ్గరే నాగచైతన్య చాలా విభిన్నంగా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఎవరూ ఊహించని విధంగా ప్రయోగాత్మకమైన కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. నాగచైతన్య కూడా తన ఇమేజ్ ను సైతం పక్కనపెట్టి విభిన్నమైన పాత్రలను కూడా చేయాలని అనుకుంటున్నాడు. కేవలం బంగార్రాజు లాంటి కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా ప్రయోగాత్మకమైన పాత్రలు చేయాలని చూస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య నటనకు మంచి గుర్తింపు లభించింది.

ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. ఇక రానున్న రోజుల్లో నాగ చైతన్య నుంచి ఎవరూ ఊహించని విధంగా ఒక సరికొత్త ప్రాజెక్టుతో రాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్నాడు. మనం దర్శకుడు విక్రమ్ కె.కుమార్ తెరకెక్కించబోయే ఆ అమెజాన్ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇదివరకే ఈ విషయంపై నాగచైతన్య అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశాడు. ఆ ప్రాజెక్టు ఒక హారర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో నాగచైతన్య ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేసింది లేదు. ఇక విక్రమ్ మాత్రం గతంలో గతంలో 13B అనే ఒక హారర్ కథ తో మంచి గుర్తింపు అందుకున్నాడు.

naga chaitanya fear look in vikram k kumar amazon web series,

ఇక ఇప్పుడు నాగచైతన్య తో థాంక్యూ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు షూటింగ్ అయితే యూరప్లో శరవేగంగా కొనసాగుతోంది. ఇక అమెజాన్ ప్రైమ్ కోసం చేయబోయే ప్రాజెక్టుల్లో నాగచైతన్య నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తాడట. చైతు ఇంతవరకు ఏ సినిమాలో కూడా చెడు పాత్రలో కనిపించింది లేదు. ఇక సెకండాఫ్ లో చాలా వైల్డ్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు నాగ చైతన్య లుక్ నీ ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ చూడని ఒక కొత్త నాగచైతన్యను ఈ వెబ్ సిరీస్ లో చూస్తారని తెలుస్తోంది. మరి నాగ చైతన్య ఆ పాత్రలో ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి. ఇక థాంక్యూ సినిమా అనంతరం ఈ అక్కినేని హీరో మరికొన్ని సినిమాలతో బిజీ కానున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా అయితే చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆ దర్శకుడు మహేష్ తో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా అనంతరం చైతు ప్రాజెక్ట్ సెట్స్ పైకి రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X