పశ్చాతాపం చెందిన నాగ చైతన్య.. జీవితంలో సరైన నిర్ణయం తీసుకోలేదని కామెంట్స్!
జోష్ సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య తనదైన శైలీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ ఫలితాలాతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
కాంట్రవర్సీ విషయాలకు దూరంగా ఉండే చైతూ ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కస్టడీ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య తాజాగా తన జీవితం గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

డిజాస్టర్: హీరో నాగ చైతన్య టాలీవుడ్ లో గుడ్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. తనదైనట శైలీలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. గతేడాది థ్యాంక్యూ సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. అలాగే లాల్ సింగ్ చద్దా మూవీతో బాలీవడ్ లోకి ఎంట్రీ ఇద్దామనుకున్న నాగ చైతన్య ప్లాన్ అంతగా వర్కౌట్ కాలేదు.

పోలీస్ ఆఫీసర్: ప్రస్తుతం నాగ చైతన్య ద్విభాష చిత్రంలో నటిస్తున్నాడు. కస్టడీ అనే మూవీ ద్వారా ఒకేసారి ఇటు తెలుగు, అటు తమిళం బైలింగువల్ ప్రాజెక్టుతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. చైతూకి ఇది తొలి తమిళ్ స్ట్రెయిట్ సినిమా. దీనికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగ చైతన్య ఎప్పుడు చేయని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

నటీనటులు: కస్టడీ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. అలాగే సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్నారు. కస్టడీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

తమ్ముడు సినిమాపై: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి కస్టడీ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు తండ్రీకొడుకులు ఒకేసారి పనిచేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాను మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు నాగ చైతన్య తమ్ముడు అఖిల్ ఏజెంట్ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూ ఇచ్చాడు.

రిగ్రెట్ అనిపించింది: 'జీవితంలో అతి పెద్ద పశ్చాత్తాపం ఏంటీ?' అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. స్పెసిఫిక్ రిగ్రెట్స్ అంటూ ఏం లేవన్న నాగ చైతన్య ప్రతిదీ ఒక పాఠం మాత్రమేనని తెలిపాడు. మళ్లీ ఒకటికి రెండుసార్లు ఇదే విషయం గురించి అడిగ్గా.. "నేను చేసిన రెండు సినిమాల విషయంలో రిగ్రెట్ గా అనిపించింది. ఆ విషయంలో సరైనా నిర్ణయం తీసుకోలేదు" అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. శోభిత ధూళిపాళతో డేటింగ్ పై క్వశ్చన్ అడగ్గా.. దాని గురించి నాకు ఏం తెలియదు. ఏజెంట్ సినిమా గురించి మాత్రమే మాట్లాడతానని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











