బాలీవుడ్ లో నాగ చైతన్య మొదటి సినిమా.. స్టార్ హీరో మూవీలో స్పెషల్ రోల్!
అక్కినేని తనయుడు నాగ చైతన్య రోజురోజుకు తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను అమితంగా పెంచుకుంటున్నాడు. అలాగే మార్కెట్ కూడా గట్టిగానే పెరుగుతోంది. ఒకప్పుడు హిట్ టాక్ వచ్చినా కూడా పెద్దగా లాభాలు అందుకోని చైతు ఇప్పుడు యావరేజ్ టాక్ తోనే ప్రాఫిట్స్ లోకి తెచ్చేస్తున్నాడు. అతను ఎంచుకుంటున్న కథలకు కూడా రెస్పాన్స్ గట్టిగానే వస్తోంది.
ఇక ప్రస్తుతం అందరి చూపు లవ్ స్టోరీపైనే ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన సాంగ్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక లవ్ స్టొరీ అనంతరం థాంక్యు సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది.

అయితే నాగచైతన్య మొదటిసారి బాలీవుడ్ సినిమాలో కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అది కూడా స్టార్ హీరో అమీర్ ఖాన్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో విజయ్ సేతుపతి చేయాల్సిన పాత్రలో చైతన్యకు ఛాన్స్ ఇచ్చినట్లు ట్తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మెరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











