Thankyou మూవీ డిజాస్టర్ పై మొదటిసారి స్పందించిన నాగచైతన్య.. తప్పులున్నాయి అంటూ..

అక్కినేని యువ హీరో నాగచైతన్య మొదటి సారి లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అందరిలో ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది. అమీర్ ఖాన్ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న చిత్రం కావున తప్పకుండా నాగచైతన్య కూడా ఈ సినిమా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనే అనిపిస్తోంది.

ఈ సినిమాలో నాగచైతన్య బాలరాజు అనే పాత్రలో కనిపించాడు ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్స్ లో కూడా నాగచైతన్య చాలా బిజీగా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో అతను ఇటీవల థాంక్యూ సినిమా రిజల్ట్ పై కూడా స్పందించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా అందుకున్న ఫలితం పై నాగచైతన్య ఆ తర్వాత పెద్దగా స్పందించింది లేదు.

naga chaitanya first reaction on thankyou movie disaster results

లాల్ సింగ్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్నప్పుడు ఈ విషయంపై కొన్ని ప్రశ్నలు ఎదురవుగా నాగచైతన్య చాలా పాజిటివ్గా స్పందించే ప్రయత్నం చేశాడు. నిజంగా థాంక్యూ సినిమా నన్ను కొంత డిస్సప్పాయింట్ చేసింది కానీ ఒక నటుడి జీవితంలో ఇవన్నీ సహజంగానే ఎదురవుతాయి. సక్సెస్ ఫెయిల్యూర్స్ అని అన్నిటినీ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆగకుండా ముందుకు వెళ్లడమే ఒక నటుడి లక్షణం. అలాగే ఎంతో కొంత ఆ ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇక సినిమాల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి అంటూ నాగచైతన్య తనదైన శైలిలో వివరించే ప్రయత్నం చేశాడు. ఇక నాగచైతన్య తన తదుపరి సినిమాను తమిళ దర్శకుడు వెంకట ప్రభుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో నాగచైతన్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X