మా నాన్నతో నా ప్రాబ్లమ్ అదే.. నాగ చైతన్య!
మరో రెండు రోజుల్లో నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం విడుదల కాబోతోంది. భారీగా చేస్తున్న ప్రమోషన్స్ కార్యక్రమాలతో సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఈ చిత్రం ఆసక్తి నెలకొని ఉంది. చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.
తాజగా నాగచైతన్య ఫాన్స్ తో సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్నాడు. అభిమానులు అడిగిన ఒక్కొక్క ప్రశ్నకు ఓపికగా సమాధానం ఇచ్చాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు చై ఇచ్చిన సమాధానం ఆసక్తిగా ఉంది. దేవదాస్ చిత్రంలో నాగార్జున స్టిల్ పోస్ట్ చేసిన అభిమాని దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు.

దానికి చై సమాధానం ఇస్తూ రోజురోజుకు ఆయన వయసు తగ్గిపోతోంది. అది నాకు సమస్యగా మారుతోంది అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దేవదాస్ చిత్రంలో నాగార్జున, నాని కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. చైతన్య అభిమానుల ప్రశ్నలకు స్పందిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోల గురించి కామెంట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని, మహేష్ సూపర్ స్టార్ అని, ప్రభాస్ లార్జర్ దాన్ లైఫ్ అంటూ సమాధానం ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











